Healthy Food for Weight Loss : శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్​లో కచ్చితంగా ప్రోటీన్​ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన, అతిముఖ్యమైన సోర్స్. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. ఆకలి తగ్గి.. అన్​ హెల్తీ స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఉండేలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గ్లూకాగాన్ లాంటి పెప్టెడ్​, కోలిసిస్టోకినిన్​ వంటి హార్మోన్లు కడుపు నిండుగా ఉండేలా హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఆకలిని తగ్గించడమే కాకుండా.. కడుపు నిండుగా ఉండి.. చిరుతిళ్లవైపు దృష్టి మళ్లకుండా చేస్తాయి. 


అందుకే బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్​లో ప్రోటీన్​ను చేర్చుకుంటారు. ఇతర అంశాల మాదిరిగానే.. ప్రోటీన్ బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రోటీన్ తీసుకునేందుకు మంచి సోర్స్​గా నాన్​వెజ్ తినేవారు చికెన్​నూ.. తిననివారు పనీర్​నూ తమ డైట్​లో చేర్చుకుంటారు. అయితే ఈ రెండిట్లో బరువు తగ్గించే లక్షణాలు దేనికి ఎక్కువగా ఉన్నాయి? ఈ ఫుడ్స్ గురించి నిపుణులు ఇచ్చే సలహా ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


రెండిట్లో ఏది మంచిది?


పనీర్, చికెన్.. ఈ రెండూ ప్రోటీన్​కు మంచి సోర్స్. వీటిలో ప్రోటీన్​తో పాటు.. పొటాషియం, మెగ్నీషియ, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో సహాయం చేస్తాయి. అయితే ఈ రెండూ బరువు తగ్గడంలో ఎలాంటి ఫలితాలు చూపిస్తాయో.. వీటిని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో.. హెల్తీగా ఉండడంలో ఈ రెండు చేసే ప్రయోజనాలపై నిపుణులు ఇచ్చే సలహా ఏమిటో తెలుసుకుందాం. దీని గురించి తెలియాలంటే అసలు చికెన్​, పనీర్​లో ఎంత ప్రోటీన్ ఉందో తెలుసుకోవాలి.


వంద గ్రాముల్లో ఏమేమి ఉంటాయంటే..


వంద గ్రాముల పనీర్ తీసుకుంటే దానిలో 18 గ్రాముల ప్రోటీన్​ అందుతుంది. అలాగే చికెన్​ను 100 గ్రాములు తీసుకుంటే దాని ద్వారా మీరు 27 గ్రాముల ప్రోటీన్​ను పొందవచ్చు. అయితే 100 గ్రాముల పనీర్ తీసుకోవడం వల్ల 22 గ్రాముల కొవ్వు లభిస్తుంది. చికెన్​లో దీని శాతం చాలా తక్కువ. 3 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా పనీర్, చికెన్​లలో కార్బోహైడ్రేట్​లు చాలా తక్కువగా ఉంటాయి. కేలరీల విషయానికొస్తే.. పనీర్​లో 265 నుంచి 320 కేలరీలు ఉండగా.. చికెన్​లో 165 కేలరీలు మాత్రమే ఉంటాయి. 


ఈ విషయం గుర్తించుకోవాలి..


పనీర్​లో 60 శాతం కొవ్వు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీసే అవకాశముంది. ఈ విషయాన్నిదృష్టిలో పెట్టుకుని.. చికెన్ మంచిదా? పనీర్ బెటరా? అనే విషయాలు తెలుసుకోవాలి. మీరు వెజ్ మాత్రమే తినేవారు అయితే మీ ప్రయారిటీ కచ్చితంగా పనీర్ అవుతుంది. ఒకవేళ రెండూ తినేవారు అయితే.. కేలరీల కౌంట్ తగ్గించుకోవడం కోసం చికెన్​ను తీసుకోవచ్చు. ఇది అన్ని విషయాల్లో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియ అందిస్తుంది. కానీ పనీర్ త్వరగా అరిగిపోతుంది. చికెన్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. 



బరువు తగ్గేందుకు..


ప్రోటీన్ బరువు తగ్గడంలో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. శరీరంలోని ప్రోటీన్​ను జీర్ణం చేసేందుకు మెటబాలీజం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. తీసుకున్న ఫుడ్ అరిగే సమయంలో 20 నుంచి 30 శాతం కేలరీలు కరిగిపోతాయని అధ్యయనం తెలిపింది. దీనివల్ల జీవక్రియ పెరుగుతంది. బరువు తగ్గడమే కాకుండా.. బరువు పెరగడాన్ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఈ రెండింట్లో చికెన్ బరువు తగ్గేందుకు హెల్ప్ చేసినా.. వెజ్​ వారు ప్రోటీన్​ కోసం పనీర్​ హాయిగా లాగించవచ్చు. 


Also Read : డయేరియా డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.. లేదంటే కష్టమే