Stock Market Profit Companies: ఎగ్జిట్ పోల్స్ అంచనా స్టాక్ మార్కెట్లలో (Stock Market) ఫుల్ జోష్ నింపింది. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో అంతా ఊహించిన విధంగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 2,621.98 పాయింట్లతో (3.55 శాతం వృద్ధి) 76,583 స్థాయి వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ కూడా 807.20 పాయింట్లు (3.58 శాతం) అద్భుత లాభంతో 23,337.90 వద్ద ప్రారంభమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్స్, ఆదానీ పోర్ట్స్, శ్రీరామ్ పైనాన్స్, ఎల్అండ్‌టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం పవర్ గ్రిడ్ 6.3 శాతం, ఎన్‌టీపీసీ 4.9 శాతం, ఎంఅండ్ఎం 4.8 శాతం మేర లాభాల్లో ఉన్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్న క్రమంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


ఈ రంగాల్లో షేర్లు..


ఆటోమోటివ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ డిస్క్రీషియనరీ షేర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కెమికల్స్ రంగాల షేర్లలోనూ పెట్టుబడులకు వీలుంది. మదుపర్లు తమ ఆర్థిక లక్ష్యాలు, అందుబాటులో ఉన్న నగదు నిల్వలు, మార్కెట్ అంచనాలు బేరీజు వేసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: Share Market Opening Today: ఎగ్జిట్ పోల్స్‌ తర్వాత మార్కెట్‌లో పూనకాలు - సెన్సెక్స్ 2600 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లు జంప్