ప్రముఖ కార్ల తయారీ సంస్థ మోరిస్ గెరాజెస్(ఎంజీ) మనదేశంలో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అదే ఎంజీ ఆస్టర్. ఈ కారు ధర రూ.9.78 లక్షలుగా(ఎక్స్-షోరూం) నిర్ణయించారు. బుకింగ్స్ స్టార్ట్ అయిన 20 నిమిషాల్లోనే ఫస్ట్ బ్యాచ్ కార్లు పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం. ధన్‌తెరాస్ సందర్భంగా 500కు పైగా కార్లను కంపెనీ డెలివరీ చేసింది.


ఒకవేళ చిప్ షార్టేజ్ కనుక లేకపోతే మరిన్ని కార్లను కంపెనీ డెలివరీ చేసే అవకాశం ఉండేది. ఈ సమస్య కేవలం ఎంజీకి మాత్రమే కాకుండా కార్ తయారీ సంస్థలన్నిటికీ ఉంది. ఈ సంవత్సరం చివరికి 4000 నుంచి 5000 యూనిట్ల వరకు డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తుంది.


రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఎంజీ ఆస్టర్ లాంచ్ అయింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో 108 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం టార్క్ ఉండనుంది. ఇక పవర్‌ఫుల్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో 138 బీహెచ్‌పీ, 220 ఎన్ఎం టార్క్ అందించనున్నారు. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ను స్టాండర్డ్‌గా అందించనున్నారు. ఇక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీ ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి.


ఆస్టర్‌లో మొత్తం తొమ్మిది వేరియంట్లు, ఐదు కలర్ వేరియంట్లు అందించారు. ఇందులో పర్సనల్ ఏఐ అసిస్టెంట్ అందించారు. దీంతోపాటు అటానమస్ టెక్నాలజీ కూడా ఉంది. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫయర్, పనోరమిక్ సన్ రూఫ్, 17 అంగుళాల అలోయ్‌లు, సబ్‌స్క్రిప్షన్లు లేదా సర్వీసులకు కనెక్ట్ అయి ఉన్న కార్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.


ఈ కారుకి డిజిటల్ కీ కూడా అందించనున్నారు. దీంతో ఫిజికల్ కీ లేకుండా బ్లూటూత్ ద్వారా కారును అన్‌లాక్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ కారును బుక్ చేసుకుంటే 2022లో డెలివరీ లభించనుంది. హెక్టార్‌కు కాస్త లోఎండ్ వెర్షన్‌గా ఆస్టర్ మనదేశంలో లాంచ్ అయింది.


ఎంజీ మనదేశంలో లాంచ్ చేసిన నాలుగో ఉత్పత్తి ఆస్టర్. హ్యుండాయ్ క్రెటా, ఫోక్స్‌వాగన్ టైగున్, కియా సెల్టోస్‌లకు ఇది కంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మంచి పోటీ ఇవ్వనుంది.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి