Top Selling Hatchback in October 2024: మీరు ఎస్‌యూవీ లేదా సెడాన్ కాకుండా వేరే తరహా కారు కొనుగోలు చేయాలని అనుకుంటే హ్యాచ్‌బ్యాక్ మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పండుగ సీజన్‌లో హ్యాచ్‌బ్యాక్‌లు బాగా అమ్ముడయ్యాయి. గత నెల అంటే 2024 అక్టోబర్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడు పోయిన హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి స్విఫ్ట్ గత నెలలో ఎన్ని యూనిట్లను విక్రయించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి సుజుకి స్విఫ్ట్
2024 అక్టోబర్ అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే మారుతి సుజుకి ఈ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించి మొత్తం 17,539 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం నంబర్ గురించి మాట్లాడినట్లయితే ఈ సంఖ్య 20,598 యూనిట్లుగా ఉంది. అయితే గతేడాది కంటే ఈ శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ మారుతి సుజుకి స్విఫ్ట్ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
అమ్మకాల పరంగా స్విఫ్ట్ తర్వాత మారుతి సుజుకి బలెనో రెండో స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం బలెనో 16,082 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది 16,594 యూనిట్లు అమ్ముడయ్యాయి. తద్వారా గతేడాదితో పోల్చితే మూడు శాతం స్వల్ప క్షీణత కనపరిచింది. మారుతి సుజుకీ కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయంలో కూడా మూడో స్థానంలో ఉంది. కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ అమ్మకాల పరంగా మూడో స్థానంలో నిలిచింది.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఫీచర్లు, ఇంజిన్ ఎలా ఉన్నాయి?
మారుతి సుజుకి స్విఫ్ట్ చాలా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది ఆకర్షణీయమైన డిజైన్, గొప్ప పెర్ఫార్మెన్స్‌కు పేరు పొందింది. దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది సుమారుగా లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. స్విఫ్ట్ స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు లోపల చాలా స్థలం కూడా ఉంది. ఇది కుటుంబానికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!