Discount on Cars: భారతదేశంలోని మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపులను అందించింది. ఆగస్టు నెలలో ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ వంటి వాహనాలపై కంపెనీ రూ.57,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ వాహనాల కొనుగోలుపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో దీని ప్రయోజనాలను పొందవచ్చు.


మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 57 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే దాని ఏఎంటీ, ఎల్ఎక్స్ఐ మాన్యువల్‌పై రూ. 52 వేల వరకు తగ్గింపు అందించనున్నారు. అదే సమయంలో దాని సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా రూ. 22,000 ఆదా చేసుకోవచ్చు.


మారుతి సుజుకి ఆల్టో కే10
ఈ కారుపై కూడా కంపెనీ రూ.57 వేల తగ్గింపును అందిస్తోంది. ఈ కారు మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 57 వేల వరకు, CNG వేరియంట్‌లపై రూ. 52 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీని AMT వేరియంట్‌లు రూ. 32 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.


మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో
ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై కంపెనీ రూ. 56 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఏఎంటీ వేరియంట్‌లో రూ. 32 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.


మారుతి సుజుకి సెలెరియో
ఈ నెలలో మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్, సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్లపై రూ. 56 వేల వరకు ఆదా చేయవచ్చు. అయితే AMT వేరియంట్‌పై రూ. 41,000 తగ్గింపు లభించనుంది.


మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
కంపెనీ ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ మోడల్ కారుపై రూ. 51 వేల వరకు తగ్గింపును అందించనుంది. అయితే దాని పెట్రోల్ వేరియంట్‌లపై కూడా రూ. 26 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.


మారుతీ సుజుకి ఈకో
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 39 వేల వరకు తగ్గింపును లభిస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా రూ. 33,100 డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.


మారుతీ సుజుకి ఆల్టో 800
మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై రూ. 15 వేల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు.


మారుతి సుజుకి డిజైర్
కంపెనీ తన మోస్ట్ పాపులర్ సెడాన్ కారు డిజైర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లపై రూ. 10,000 వరకు లాభాలను అందించనుంది. అయితే దీని సీఎన్‌జీ వేరియంట్‌లపై మాత్రం ఎటువంటి తగ్గింపులు అందించలేదు.  










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial