Maruti Suzuki Fronx: భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయింది. కేవలం ఏడు నెలల్లోనే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ మోడల్‌కు సంబంధించిన 75,000 యూనిట్లను విక్రయించింది. ఐదు వేరియంట్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా + జీటా, ఆల్ఫా) అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ. 7.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది.
హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడంలో ఈ కారు విజయవంతం అయింది. ఎందుకంటే ఈ కారు దాని సెగ్మెంట్‌లో చవకైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది.
మారుతి ఫ్రాంక్స్‌ను బలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. అమ్మకాల పరంగా ఇది జనాదరణ పొందిన బలెనోను కూడా దాటేసింది. ఈ కాంపాక్ట్ SUV బలెనో హ్యాచ్‌బ్యాక్ తరహా డిజైన్‌తో పాటు గ్రాండ్ విటారా ఎస్‌యూవీ స్టైలింగ్‌ను కలిగి ఉంది. దాని దిగువ బంపర్‌పై హెడ్‌లైట్‌లతో పాటు స్ప్లిట్ గ్రిల్ అందించారు. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌తో ప్రత్యేక టెయిల్‌గేట్ డిజైన్ దాని వెనుక వైపు కనిపిస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కలర్ ఆప్షన్స్
ఆర్కిటిక్ వైట్, ఎర్టెన్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీన్ని డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎర్టెన్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫీచర్లు
ఇందులో బర్గండీ, బ్లాక్ థీమ్‌తో ఉన్న ఫ్రీ స్టాండింగ్ తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. డీఆర్ఎల్‌తో కూడిన ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక ఏసీ వెంట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం కూడా ఉన్నాయి. అదే సమయంలో సెక్యూరిటీ ఫీచర్లుగా హెచ్‌యూడీ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ఈఎస్‌పీ మొదలైన సౌకర్యాలను తకూడా కలిగి ఉంది.
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ ఇంజిన్
ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఎంపికలతో వచ్చింది. మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్ట శక్తి 89 బీహెచ్‌పీ, గరిష్ట టార్క్ 113 ఎన్ఎం, రెండవది 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ అందించారుజ ఇది గరిష్టంగా 100 బీహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం పీక్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్ వంటి SUVలతో పోటీపడుతోంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!