Maruti Suzuki First Electric MPV: మారుతి సుజుకి వాహనాలకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతికి చెందిన 17 వాహనాలు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో మారుతి ఈవీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మారుతి సంస్థ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎంపీవీని మార్కెట్లోకి త్వరలో విడుదల చేయబోతోంది. రాబోయే సంవత్సరాల్లో మారుతి అనేక ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో ఎస్‌యూవీ, ఎంపీవీ కార్లు కూడా ఉండనున్నాయి.
మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎంపీవీ
మారుతి సుజుకి ఇప్పటికే ఎర్టిగా,ఎక్స్ఎల్6 వంటి ఎంపీవీ మోడళ్లను కలిగి ఉంది. ఇప్పుడు కంపెనీ MPV విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతుంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎంపీవీని తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది. వైఎంసీ పేరుతో ఈ వాహనం పనులు జరుగుతున్నాయి. మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్ ఇంజిన్, బ్యాటరీ ప్యాక్‌నే ఎంపీవీలో కూడా అందించనున్నారని తెలుస్తోంది.
ఈవీఎక్స్ ఆధారంగానే...
మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎంపీవీని దాని ఈవీఎక్స్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు. మారుతి, టయోటా మధ్య పరస్పర భాగస్వామ్యంతో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేశారు. ఈవీఎక్స్ ఎస్‌యూవీని తయారు చేసిన ఈ ప్లాట్‌ఫారమ్‌పై అనేక రకాల ఎలక్ట్రిక్ కారు మోడల్స్‌ను తయారు చేయవచ్చు. 29పీఎల్ స్కేట్‌బోర్డ్‌ను మారుతి ఎంపీవీలో కూడా ఉపయోగించనున్నారు. మారుతి ఈవీఎక్స్ ఎస్‌యూవీ 2024 చివరిలో మార్కెట్లోకి వస్తుంది. అయితే ఎలక్ట్రిక్ ఎంపీవీ 2026లో భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు.
ఈ దశాబ్దం చివరి వరకు మారుతి రోడ్‌మ్యాప్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో మారుతికి చెందిన 17 మోడల్స్ ఉన్నాయి. దశాబ్దం చివరి నాటికి ఈ సంఖ్యను 28కి పెంచాలని కంపెనీ అనుకుంటోంది. మారుతి అనేక మూడు వరుసల మోడళ్లను విడుదల చేయడంపై దృష్టి పెట్టనుంది. మారుతి రూపొందించనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ 7 సీటర్ కారు తయారీలో ఖర్చులను తగ్గించడానికి ఈవీఎక్స్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్, ఇతర పవర్‌ట్రెయిన్ భాగాలను ఉపయోగించింది. మారుతి ఈవీఎక్స్‌లో 40 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్ యూనిట్ల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీంతో ఎలక్ట్రిక్ ఎంపీవీ రేంజ్ కూడా ఈవీఎక్స్ లాగా 550 కిలోమీటర్లను కలిగి ఉంటుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?