Maruti Suzuki to hike prices: కొత్త మారుతి సుజుకీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో పలుమార్లు ధరలను పెంచిన ఈ కార్ల కంపెనీ, మరోసారి ప్రైస్‌ హైక్‌ ప్రకటించింది. ఆగస్టు 2026 నుంచి రేట్లు పెంచబోతోంది. కంపెనీ నిర్ణయంతో, మారుతి సుజుకి కార్ల ధరలు మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.30,000 వరకు పెరగనున్నాయి. కాబట్టి, కొత్త కారు కొనాలనుకునేవారు ఈ నెలలోనే, ధరలు పెరగకముందే బుకింగ్ చేసుకోవడం బెటర్‌.

Continues below advertisement

ఈ ఏడాదిలో మారుతి సుజుకీ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌లో కూడా ఈ కంపెనీ అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలను పెంచింది. ఇప్పుడు కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి అదే స్థాయిలో ధరల పెంపు ప్రకటించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది.

ధరల పెంపునకు కారణాలేంటి?ధరల పెంపుపై స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన నివేదికలో కంపెనీ స్పష్టమైన కారణాలను వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతుండటం, ఉత్పత్తి వ్యయం అధికమవడం, కమోడిటీ ధరల్లో ద్రవ్యోల్బణం కొనసాగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

Continues below advertisement

అంతేకాదు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు అంతర్గతంగా కొన్ని చర్యలు చేపట్టామని, తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు కూడా చేశామని కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ వ్యయాలపై ఒత్తిడి తగ్గకపోవడంతో మొత్తం భారం భరించడం సాధ్యం కాలేదని, అందులో కొంత భాగాన్ని మాత్రమే వినియోగదారులపై మోపుతున్నామని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!

ఏ మోడల్‌కు ఎంత పెంపు?2026 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపు అన్ని మోడళ్లకు ఒకేలా ఉండదు. ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదాన్ని బట్టి ధరల సవరణ ఉంటుంది. కొన్ని వేరియంట్‌లలో స్వల్ప పెరుగుదల ఉండగా, మరికొన్నింటిలో గరిష్ఠంగా రూ.30,000 వరకు పెరగనుంది. ఏ మోడల్‌ రేటు ఎంత పెరిగిందనేది కంపెనీ త్వరలోనే ప్రకటిస్తుంది.

ఇటీవల, ఆటోమొబైల్ రంగంలో వరుసగా ధరల పెంపులు కొనసాగుతున్నాయి. ముడి పదార్థాల ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు, తయారీ వ్యయాల పెరుగుదల కారణంగా ప్రముఖ కంపెనీలు ధరలను సవరిస్తున్నాయి. మారుతి సుజుకీతో పాటు మహీంద్రా, బీవైడీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా ఇటీవల తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: మారుతి ఎర్టిగా EMI లెక్కలు ఏంటీ? ఎంత శాలరీ ఉంటే కొనుక్కోవచ్చు? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకీ ధరలు పెంచడం వల్ల ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం SUVల వరకు అన్ని విభాగాల కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్నాళ్లు ఆగిన తర్వాత కొత్త కారు కొందామనే ప్లాన్‌లో ఉన్నవాళ్లు, ఆగస్టు ధరల పెంపు అమల్లోకి రాకముందే బుకింగ్ పూర్తి చేస్తే కొంత మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.