Maruti Suzuki Ertiga EMI Calculator 2026: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో 7 సీటర్‌ MPV సెగ్మెంట్‌లో టాప్‌లో ఉన్న ఏకైక మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. అందుకే ఎక్కువ మంది పెద్ద ఫ్యామిలీలు కలిగి ఉన్న వారంతా దీన్ని ఎంచుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్‌లకు, కమర్షియల్, పర్సనల్ వినియోగానికి కూడా వాడుకుంటున్నారు. మంచి స్పేస్‌, మైలేజీ, రీసేల్‌ వ్యాల్యూ ఉండటమే దీనికి కారణం. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో దీన్ని కొనుగోలు చేయాలి అంటే డౌన్‌పేమెంట్‌ ఎంత చెల్లించాలి? ఏ శాలరీలు ఉన్న వారు కొనుక్కోవచ్చో చూద్దాం. 

Continues below advertisement

హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్‌ ధర ఎంత?

కారు ధర అనగానే చాలా మంది కేవలం ఎక్స్‌షోరూమ్ ధర మాత్రమే చూసి అంచనా వేసుకుంటారు. కానీ కారు రోడ్డుపైకి రావడానికి ఆర్టీవో రోడ్‌ టాక్స్‌, ఇన్సూరెన్స్‌, ఫాస్ట్‌టాగ్‌, టీడీఎస్‌, టీసీఎస్‌ వంటి అదనపు ఛార్జీలు తోడవుతాయి. తెలంగాణలో రోడ్డు పన్నుల నిర్మాణం కారణంగా ఆన్‌రోడ్‌ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్‌ ధర సుమారు 10.83 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్‌ మోడల్‌కు 16.29 లక్షల వరకు ఉంది. 

Continues below advertisement

LXi(O)పెట్రోల్‌ బేస్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్‌ ధర 8,85,000 కాగా ఆర్టీవో ఛార్జీలు 1.52 లక్షలు. ఇన్సూరెన్స్‌ 45,300 కలిపి హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర సుమారు 10,83,025గా ఉంది. 

మిడ్‌ వేరియంట్‌ VXi(O) పెట్రోల్‌ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర 9,90,300 హైదరాబాద్‌ ఆన్‌ రోడ్‌ ధ సుమారు 12,06,943 రూపాయలు. VXi(O)సీఎన్జీ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్ ధర 10,86,300 ఉంటే ఇది హైదరాబాద్‌లో ఆన్ రోడ్‌ ప్రైస్‌ 13,68,368 రూపాయలుగా ఉంది. ZXi ప్లస్‌ ఏటీ ఎక్స్‌ షోరూమ్ ర 12,99,100 రూపాయలు అయితే ఇది హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 16,28,703 రూపాయలుగా ఉంది.

ఎంత చేతిలో ఉంటే షోరూమ్‌కు వెళ్లొచ్చు?

సాధారణంగా బ్యాంకులు వాహనం ఆన్‌రోడ్ ప్రైస్ మొత్తానికి లోన్ ఇవ్వరు. వాహనం ధరలో 80 శాతం వరకు మాత్రమే లోన్ ఇస్తారు. మీ సిబిల్ స్కోరు బాగుంటే 90 శాతం వరకు ఇస్తాయి. అందుకే మీరు కనీసం పది శాతం డౌన్‌పేమెంట్ ఉంటే షోరూమ్‌కు వెళ్లి వాహనం కొనుగోలు చేయవచ్చు. మీరు బేసి వేరియంట్‌ ఎర్టిగా LXi(O) తీసుకుంటే 10.83 లక్షలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో పది శాతం అంటే 1.08,300 రూపాయలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు, ఎక్స్‌టెండ్‌ వారంటీ, యాక్సెసరీస్‌ కలిపి దాదాపు 1.25 లక్షల నుంచి 1.35 లక్షలు చేతిలో ఉంటే మీరు కారు కొనుక్కోవచ్చు. 

అయితే పది శాతం మీరు చెల్లించినా కారు కొనుక్కోవచ్చు. కానీ ఫైనాన్షియల్‌ ప్లానర్లు మాత్రం 20 శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలని సూచిస్తున్నారు. అంటే ఎర్టిగా బేస్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే 2,16,000 లేదా మిడ్ వేరియంట్‌ కోసం 2,40,000 రూపాయలు డౌన్‌పేమెంట్ చేల్లించాల్సి ఉంటుంది. 

ఈఎంఐ క్యాలిక్యులేషన్స్‌

ప్రస్తుతం జాతీయ, ప్రైవేటు బ్యాంకులు ఆటో లోన్‌లపై సగటగున 8.5 నుంచి 9.5 శాతం వడ్డీ రేటును వసూలు వస్తున్నాయి. మంచి సిబిల్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది. పది శాతం డౌన్‌పేమెంట్ చెల్లిస్తే 90 శాతం మొత్తాన్ని 8.5 శాతం వడ్డీ రేటుతో వివిధ కాలపరిమితులకు ఈఎంఐ లెక్కలు ఇలా ఉంటాయి. 

బేస్ వేరియంట్‌ LXi(O) పెట్రోల్‌ వేరియంట్‌ కోసం 9,74,700 అమోంట్‌ను లోన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌ కోసం తీసుకుంటే ప్రతి నెల 20,030 చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల టెన్యూర్‌ కోసం లోన్ తీసుకుంటే నెలకు 15, 450 రూపాయలు చెల్లించాలి. 

ఎర్టిగాలో ఎక్కువగా అమ్ముడుపోయే VXi(O) పెట్రోల్‌ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి అంటే 10, 85, 200 రూపాయలు లోన్ ద్వారా లభిస్తుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 22,320 రూపాయలు చెల్లించాలి. 7 ఏళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే 17, 220 రూపాయలు EMI చెల్లించాలి. 

మంచి డిమాండ్‌ ఉన్న VXi(O)సీఎన్జీ కారు తీసుకుంటే మీకు 12,31,500 రూపాయలు లోన్ వస్తుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 25, 300 ఈఎంఐ కట్టాలి. ఏడేళ్లకు తీసుకుంటే ప్రతి నెల 19, 510 రూపాయలు చెల్లించాలి. 

ఎంత శాలరీ వస్తే ఎర్టిగాను కొనుగోలు చేయగలరు?

వ్యక్తిగత ఆర్థిక సూత్రాల ప్రకారం మీ కారు నెలవారీ ఈఎంఐ అనేది మీ నికర నెలవారీ ఆదాయంలో 15 శాతం నుంచి 20 శాతం మించకూడదు. దీని కంటే ఎక్కువైతే నెలవారీ ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సేవింగ్స్‌ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐదేళ్ల ప్లాన్ ఎంచుకుంటే  మీరు నెలకు వరకు ఈఎంఐ చెల్లించాలి. అలాంటి సమయంలో మీ నెలవారీ శాలరీ లక్షకు పైబడి ఉండాలి. ఏడేళ్ల టెన్యూర్ ప్లాన్‌లో తీసుకుంటే మీరు నెలకు 15వేలకుపైగా ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు మీ దాయం 75వేల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే మీ సేఫ్ జోన్‌లో ఉంటారు. టాప్ మోడల్‌ను తీసుకుంటే నెలకు మీరు పాతిక వేలకుపైగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీ ఆదాయం లక్షా 50 వేల వరకు ఉంటేనే మీకు మంచిది. 

కేవలం ఈఎంఐను మాత్రమే మీరు శాలరీలో భాగం చేసుకుంటే దెబ్బతింటారు. దాన్ని రోడ్డుపై తిప్పడానికి అయ్యే ఖర్చు, నిర్వహణ ఖర్చులను కూడా చూసుకోవాలి. ఎర్టిగాలోని 1.5 లీటర్ కే15సీ స్మార్ట్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక సీఎన్జీ వేరియంట్ 26 కిలోమీటర్లకు పైగా ఇస్తుంది. రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణించే వారికి పెట్రోల్ వెర్షన్ నెలకు సుమారు ఆరు వేల నుంచి ఏడు వేలు ఖర్చు అవుతుంది. అదే సీఎన్జీ అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది. 

కొత్త కారు కొనేటప్పుడు కేవలం షోరూమ్ ధరలు, డిస్కౌంట్‌లు చూసి తొందరపడొద్దు. మీ నెలవారీ టేక్‌హోమ్ శాలరీలో 15 శాతం కంటే ఎక్కువ అమౌంట్‌ కార్ ఈఎంఐ రూపంలో వెళ్లకుండా చూసుకోవాలి.