Maruti e Vitara Launched: మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో (BMGE 2025) ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. మొదటి రోజున దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు 'మారుతి ఇ విటారా'ను పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం ఆటో ఎక్స్‌పో సందర్భంగా మారుతి eVX పేరుతో భారతదేశంలో కాన్సెప్ట్‌గా కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ SUV ఇదే. కొత్త E Vitara అనేది సుజుకికి ప్రపంచవ్యాప్త మోడల్. వీటిని సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తారు. దాని ఉత్పత్తిలో 50 శాతం జపాన్, యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్రణాళిక చేయబడింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా అందించబడుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈ SUV ని మాత్రమే ప్రదర్శించింది.


Image


కొత్త E Vitara ఎలా ఉంది ?
కొత్త సుజుకి ఇ-విటారా  కాన్సెప్ట్ మోడల్‌ని పోలి ఉంటుంది. దీని లుక్, డిజైన్,  సైజ్ మారుతి eVXని పోలి ఉంటాయి. కొన్ని షార్ప్ యాంగిల్స్ తగ్గించబడినప్పటికీ దానిలో ఎక్కువ భాగం eVX కాన్సెప్ట్ మాదిరిగానే ఉంది.  ఇది ముందు, వెనుక భాగంలో ట్రై-స్లాష్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు  ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. దీనిలో వెనుక డోర్ హ్యాండిల్‌ను సి-పిల్లర్‌కు కనెక్ట్ చేశారు, ఇది పాత స్విఫ్ట్ లాగానే ఉంటుంది.



18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ SUV పొడవు 4,275మి.మీ, వెడల్పు 1,800మి.మీ, ఎత్తు 1,635మి.మీ. దీనికి 2,700మి.మీ వీల్‌బేస్ లభిస్తుంది. ఇది క్రెటా కంటే పొడవుగా ఉంటుంది. ఈ పెద్ద వీల్‌బేస్ కారు లోపల మెరుగైన బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో సహాయపడుతుంది. దీనికి 180మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది చాలా భారతీయ రోడ్ పరిస్థితులకు సరిపోతుంది. వివిధ రకాలను బట్టి దీని మొత్తం బరువు 1,702 కిలోల నుండి 1,899 కిలోల వరకు ఉంటుంది.



బ్యాటరీ ప్యాక్, రేంజ్ 
ఆ కంపెనీ మారుతి ఇ విటారాను రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో (49kWh, 61kWh) పరిచయం చేసింది. దీనిలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌కు డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఇవ్వబడింది. దీనిని కంపెనీ ఆల్ గ్రిప్-E అని పిలుస్తుంది. ఇది చైనీస్ కార్ కంపెనీ బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) నుండి సేకరించిన బ్లేడ్ సెల్ లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ ఎనర్జీని అందిస్తుంది.  ఇతర కార్ల తయారీదారులు బ్యాటరీ సెల్‌లను మాత్రమే ఎగుమతి చేసి, స్థానికంగా అసెంబుల్ చేసి తమ వాహనాల్లో ఉపయోగిస్తుండగా, సుజుకి మొత్తం బ్యాటరీ ప్యాక్‌ను BYD నుండి దిగుమతి చేసుకుంటోంది.



Also Read: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కొట్టిన స్కోడా కైలాక్ - ధర కూడా బడ్జెట్‌లోనే!


పవర్, పర్ఫామెన్స్  
ఫ్రంట్ ఆక్సిల్‌పై ఒకే మోటారుతో కూడిన 49kWh బ్యాటరీ 144hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సింగిల్-మోటార్‌తో కూడిన పెద్ద 61kWh బ్యాటరీ ప్యాక్ 174hp వరకు పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు 189Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. అయితే, E-AllGrip (AWD) వేరియంట్ వెనుక ఆక్సిల్‌పై అదనంగా 65hp మోటారును కలిగి ఉంది. దీని కారణంగా మొత్తం పవర్ అవుట్‌పుట్ 184hpకి, టార్క్ 300Nmకి పెరుగుతుంది. ఇది చాలా ఎక్కువ.



ఈ ఫీచర్లు కూడా  
ఈ SUV క్యాబిన్ లో డ్యూయల్ స్క్రీన్‌తో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లేదా యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఇది టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉండటమే కాకుండా.. ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ప్లే ప్రో+ సిస్టమ్ కంటే చాలా ఎక్కువ సమాచార డిజిటల్ డయల్‌ను కూడా కలిగి ఉంది. వెనుక భాగంలో స్ప్లిట్-ఫోల్డింగ్ సీటు, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు, అన్ని ప్రయాణీకులకు మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు లభిస్తాయి. మారుతి ఇ విటారా అధునాతన ఫీచర్లతో అమర్చబడింది. ఇది ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, AWD వెర్షన్ కోసం 'ట్రైల్'తో సహా డ్రైవ్ మోడ్‌లు, హిల్ డీసెంట్ కంట్రోల్, సింగిల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, హీటెడ్ మిర్రర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ను పొందుతుంది. సేఫ్టీ ఫీచర్లు అధికంగా కంపెనీ అందిస్తోంది.  



Also Read: బాక్సీ లుక్‌తో అదరగొడుతున్న సియెర్రా, మరో హార్స్‌పవర్‌తో వస్తున్న హారియర్ - టాటా మోటార్స్‌ కొత్త ఈవీలు