Zomato : ఒక వ్యక్తికి, జొమాటో కస్టమర్ కేర్ కి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాయ్ కోసం చేసిన ఆర్డర్ కు సంబంధించిన వివరాలను, జరిగిన విషయాన్ని యూట్యూబర్ ఇషాన్ శర్మ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ పోస్టుకి ఆయన జొమాటోకి పూకీ చాట్ మద్దతు లభించింది అని క్యాప్షన్ లో చేర్చారు. జొమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో తన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ను షేర్ చేశాడు.
అసలేమైందంటే..
ఇషాన్ (యూట్యూబర్) అనే కస్టమర్ జొమాటోలో చాయ్ కోసం ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ అందుకున్నాక అందులో బెల్లం లేదని తెలుసుకుని నిరాశ చెందాడు. ఆ తర్వాత అతను వెంటనే కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాడు. తన ఫిర్యాదుపై పూకీ పద్ధతిలో వారు వెంటనే స్పందించారు. తనకు చాయ్ అవసరం లేదని, ఇప్పుడేం చేయాలని జోమాటో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇమ్రాన్‌తో ఇషాన్ చెప్పాడు, "సార్..! మీరు చాయ్ తీసువాలని నేను అభ్యర్థిస్తున్నాను..!" అని కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ చేప్పగా.. బెల్లం లేకుండా తాను చాయ్ తాగలేనన్నాడు. బెల్లం డబ్బు వాపస్ ఇవ్వాలని కోరతానని, దాని ధర రూ.6 అని ఇమ్రాన్ చెప్పాడు. మీరలా ఫీల్ అవాలని తాను అనుకోవడం లేదని, చాయ్ లేకుండా ఉదయం ఎలా ఉంటుందో తనకు తెలుసని, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందని ఎగ్జిక్యూటివ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇషాన్ షేర్ చేసిన ఈ స్క్రీన్ షాట్ కస్టమర్ కి జొమాటోకి మధ్య జరిగిన ఫ్రెండ్లీ సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఈ పోస్ట్ కు ఇప్పటివరకు 4వేల కంటే ఎక్కువ వ్యూస్. అనేక లైక్స్, కామెంట్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. మీరు ఒంటరిగా ఉన్నారని వారికి తెలుసు. అందుకే మీకు స్పెషల్ పూకీ సపోర్ట్ లభించిందని కొందరు చెప్పారు. #PookieSupport అంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జొమాటో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాను సంతోషపెట్టడం ఇదేం మొదటిసారి కాదు. గత సంవత్సరం, ఒక కస్టమర్ - జొమాటో సోషల్ మీడియా టీమ్ మధ్య జరిగిన ఒక చాట్ ఒక ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ గేమ్, ‘ఏక్ మచ్లీ పానీ మే గయీ’ని ట్యాప్ చేయడంతో పరిహాసానికి దారితీసింది. దీనిపై నెటిజన్లు కూడా తమ ప్రశంసలను త్వరగా వ్యక్తం చేశారు. చాలామంది తమ ఆలోచనలను పంచుకున్నారు.
జొమాటో పూకీ అంటే..
జొమాటో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ - కస్టమర్ మధ్య జరిగే సంతోషకరమైన చాట్ ను సోషల్ మీడియాలో 'జొమాటో పూకీ' అని పిలుస్తున్నారు.
Also Read : Viral News : సోషల్ మీడియా పిచ్చితో బిడ్డకు విషమిచ్చిన తల్లి- ఫాలోవర్లు, ఫేమ్, నిధుల కోసం వెర్రివేషాలు