CIL Recruitment: కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


వివరాలు..   


ఖాళీల సంఖ్య: 434


* మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్‌


విభాగాల వారీగా ఖాళీలు..


⏩ కమ్యూనిటీ డెవలప్‌మెంట్: 20 పోస్టులు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60% మార్కులతో రూరల్ డెవలప్‌మెంట్ లేదా సోషల్ వర్క్,  సంబంధిత రంగాలలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ ఎన్విరాన్‌మెంట్: 28 పోస్టులు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌) లేదా ఏదైనా ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు పీజీ డిగ్రీ/డిప్లొమా (ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ ఫైనాన్స్: 103 పోస్టులు 
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ లీగల్: 18 పోస్టులు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60% మార్కులతో 3 సంవత్సరాలు / 5 సంవత్సరాల లా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ మార్కెటింగ్ & సేల్స్: 25 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60% మార్కులతో రెండేళ్ల ఎంబీఏ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్)తో పాటు స్పెషలైజేషన్(మార్కెటింగ్ (మేజర్)) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్: 44 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ లేదా మెకానికల్)తో పాటు రెండేళ్ల ఎంబీఏ/పీజీ డిప్లొమా(మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


⏩ పర్సనల్ & హెచ్ఆర్: 97 పోస్టులు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్‌లో కనీసం రెండేళ్ల ఫుల్ టైమ్ పీజీ/పీజీ డిప్లొమా/ పీజీ ప్రోగ్రామ్‌తో పాటు స్పెషలైజేషన్‌(హెచ్‌ఆర్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఎంహెచ్‌ఆర్‌ఓడీ లేదా ఎంబీఏ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌)తో పాటు స్పెషలైజేషన్‌(హెచ్ఆర్(మేజర్)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 


⏩ సెక్యూరిటీ: 31 పోస్టులు 
అర్హత: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 


⏩ కోల్ ప్రిపరేషన్: 68 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో కెమికల్/మినరల్ ఇంజినీరింగ్/మినరల్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 


వయోపరిమితి: 30.09.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్- 10 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ- 15 సంవత్సరాలు),  ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT), షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.   


పే స్కేల్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.50,000 – 1, 60,000. వరకు చెల్లిస్తారు. శిక్షణ పూర్తియైన తర్వాత E-3 గ్రేడ్‌లో రూ.60,000 – 1,80,000. వరకు జీతం లభిస్తుంది. 


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2025


Notification


Online Application 


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..