మారుతి సుజుకి కంపెనీ ఇప్పటికే పలు హ్యాచ్‌ బ్యాక్‌ లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా సెలెరియోను సరికొత్తగా లాంచ్ చేసింది. AMT ట్రాన్స్‌మిషన్‌తో ప్రారంభం అయిన ఈ కారు.. ప్రస్తుతం సెకెండ్ జెనెరేషన్ గా అడుగు పెట్టింది. ఈ సరికొత్త రెండవ తరం మోడల్‌ లో మారుతి అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ చిన్న రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.. 


సరికొత్త సెలెరియోలో ధర, స్పెసిఫికేషన్లు  


ఈ కారు మిగతా వాటితో పోల్చితే అంతగా చౌకగా ఉండదు. కొత్త-జెనెరేషన్ మోడల్ చక్కటి అడిషనల్ ఫీచర్లను కలిగి ఉంది. సిటీ వినియోగానికి ఫన్-టు-డ్రైవ్ కు ఈ హ్యాచ్‌ బ్యాక్‌ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు టాప్-ఎండ్ మాన్యువల్ మోడల్ ధర రూ. 7 లక్షలతో పాటు ఆన్-రోడ్ ధర మరింత ఎక్కువ ఉంటుంది. చిన్న సెలెరియోను పార్క్ చేయడం చాలా సులభం. కాంపాక్ట్ కొలతలు కారణంగా నగర వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నగర ప్రయాణాల కోసం, కారులో మీకు అవసరమైన, కావలసిన అన్ని ఫీచర్లు ఉన్నాయి. రేర్ వ్యూ కెమెరా చాలా ఉపయెగకరంగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి సహాయపడుతుంది. పవర్డ్ మిర్రర్‌లు, చక్కని టచ్‌ స్క్రీన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. సీటు ఎత్తు సర్దుబాటుతో పాటు సరైన డ్రైవింగ్ పొజిషన్‌ ను పొందే అవకాశం ఉంటుంది. ఇది బయట నుంచి చూడ్డానికి చిన్నదిగా కనిపించినా,  లోపల మాత్రం విశాలంగా ఉంటుంది. మునుపటి సెలెరియోతో పోలిస్తే, నాణ్యత చాలా మెరుగ్గా ఉంది. లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.   


మైలేజ్ ఎంత వస్తుందంటే?


ఇందులో స్లిక్ మాన్యువల్ మెరుగ్గా ఉంటుంది. సెలెరియోలోని మాన్యువల్‌లో లైట్ క్లచ్, స్లిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. చాలా ఈజీగా ఉపయోగించేలా ఉంటుంది. 66bhp/89Nm గల 1.0l Dualjet ఇంజన్ ఇందులో హైలైట్ గా చెప్పుకోవచ్చు. నగరానికి సరైన గేరింగ్‌తో పాటు తరచుగా డౌన్‌షిఫ్ట్‌లు అవసరం లేదు. మోటారు తక్కువ వేగంతో ట్రాక్ చేయగలదు.  మంచి గ్రౌండ్ క్లియరెన్స్ (170 మి.మీ),  తేలికైన స్వభావంతో కొండల్లో డ్రైవింగ్ చేయడం సులబభతరంగా ఉంటుంది. 313l బూట్ కూడా ఉంటుంది.  AMTతో పోలిస్తే, మాన్యువల్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. రోడ్ ట్రిప్‌లకు చక్కగా ఉంటుంది. నగర మైలేజ్ పరంగా, ఇది 14-15 kmplగా ఉంటుంది. క్లెయిమ్ చేయబడిన 24 kmpl ప్లస్ కాదు.  AMT కి హైవేలపై మెరుగైన సామర్థ్యాన్ని పొందుతుంది, మాన్యువల్ సెలెరియో మైలేజ్ 18-19 kmpl వరకు పెరుగుతుంది.


సరికొత్త సెలెరియోలో సరికొత్త ఫీచర్లు


సరికొత్త సెలెరియోలో అన్నింటికంటే, మెరుగైన హై-స్పీడ్ స్టెబిలిటీ, హ్యాండ్లింగ్‌ ను  కలిగి ఉంటుంది. ఇది ఒక చిన్న స్విఫ్ట్‌ తో పాటు దాని వ్యాగన్ Rతో పోల్చితే పెప్పీ హ్యాచ్‌ బ్యాక్ లాగా అనిపిస్తుంది. 2,500 కిలో మీటర్ల తర్వాత, సెలెరియో ఇంజన్, వినియోగ సామర్థ్యం బాగుంటుంది. వ్యాగన్ R కంటే మరింత ప్రాక్టికల్ గా ఉంటుంది. యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. 


Read Also: మారుతి సుజుకి నుంచి XL6, బాలెనో CNG కార్ల లాంచ్ - ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే