మారుతి హైబ్రిడ్, మిల్-హైబ్రిడ్ మోడళ్లను అందుబాటులోకి తేవడంతో పాటు దాని CNG పరిధిని రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ విస్తరణ మారుతి సుజుకి ప్రీమియం నెక్సా శ్రేణికి కూడా చేరుకుంటుంది. ఈ కంపెనీ అమర్చిన CNG కార్లు చాలా సురక్షితమైనవి కావడంతో పాటు ఆఫ్టర్ మార్కెట్ లో ఉపయోగించడం ఈజీగా ఉంటుంది. అందులో భాగంగానే బాలెనో, XL6 CNG మోడల్స్ పరిచయం అయ్యాయి. S-CNG కార్లు రెండూ డ్యూయల్ ఇంటర్-డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECU), ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. CNG ఇంధనం నింపే ప్రక్రియలో వాహనం స్టార్ట్ కాకుండా చూసే మైక్రోస్విచ్ ఉంది.
6 ఎయిర్ బ్యాగ్ లతో కూడిన ఏకైక ప్రీమియం CNG హ్యాచ్ బ్యాక్
బాలెనో CNG 30.61 km/kg మైలేజీని అందిస్తున్నది. అయితే, ఇది భారతదేశంలో 6 ఎయిర్ బ్యాగ్‌లు కలిగిన ఏకైక ప్రీమియం CNG హ్యాచ్ బ్యాక్ కావడం విశేషం. పవర్ పరంగా CNG మోడ్‌లో 98.5 Nm, 77.4 PSకి తగ్గించారు. కార్ టెక్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు, CNG-నిర్దిష్ట స్క్రీన్‌లు కలిగిన MID డిస్‌ప్లే సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఇది డెల్టా, జీటా అనే రెండు ట్రిమ్‌లతో అందుబాటులో ఉంటుంది. సుజుకి కనెక్ట్, టచ్ స్క్రీన్, టాప్-ఎండ్ ట్రిమ్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో వస్తున్న XL6 CNG 26.32 km/kg ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. XL6 CNG CNG మోడ్‌లో 121.5 Nm, CNG మోడ్‌లో 87PSను కలిగి ఉంటుంది.
CNG వెర్షన్ ధర రూ. 95,000 ఎక్కువ
ఈ లేటెస్ట్ కార్లపెట్రోల్ వెర్షన్‌లతో పోల్చితే CNG వెర్షన్ ధర రూ. 95,000 ఎక్కువ. బాలెనో డెల్టా, జీటా ట్రిమ్‌లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్నది. అయితే XL6 CNG జీటా ట్రిమ్‌లో మాత్రమే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బాలెనో సిఎన్‌జికి ఎటువంటి పోటీ లేదు. ఎందుకంటే, మరే ఇతర ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్ సిఎన్‌జి ఎంపికతో రావడవ లేదు. సిఎన్‌జి పంపులు లేకపోవడం, ఎక్కువ సేపు వేచి ఉండటమే సమస్యగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఫ్యాక్టరీకి ఫిట్టింగ్ CNG కారు పెట్రోల్ కారుతో పోల్చితే మరింత ప్రాక్టికల్ గా ఉంటుంది. అయితే XL6 అనేది ఎఫిసియెంట్ ఫ్యామిలీ MPV రకాలుగా కూడా అప్పీల్ చేస్తుంది.
బాలెనో S-CNG ధరలు: (ఎక్స్ షోరూమ్ రూ.)
డెల్టా (MT) వేరియంట్- 8, 28,000
జీటా (MT) వేరియంట్- 9, 21, 000
XL6 S-CNG ధరలు: (ఎక్స్-షోరూమ్ రూ.)
జీటా (MT) వేరియంట్- 12, 24,000