Maruti Suzuki VS Tata Motors: మారుతి సుజుకి కార్లు మంచి మైలేజీని ఇస్తాయి. మరోవైపు టాటా మోటార్స్ తన కార్లలో భద్రతకు హామీ ఇస్తుంది. ఈ రెండు బ్రాండ్ల కార్లు మార్కెట్లో మంచి పేరు పొందాయి. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌ కార్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ రెండు కార్లు రూ. 10 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.


భారతదేశంలోని ఈ రెండు ఫేమస్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. దీన్ని బట్టి వీటిలో ఏది బెస్ట్ అని డిసైడ్ చేసుకోవచ్చు. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్... ఈ రెండు కార్లు చాలా పోలికలను కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్ల పాపులారిటీతో పాటు కొన్ని ఫీచర్లు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి.


రెండిటి మధ్య ఉన్న పోలికలు ఇవే...
మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ రెండూ 5 సీటర్ కార్లు.
ఈ రెండు వాహనాల పొడవు నాలుగు మీటర్ల పరిధిలో ఉంటుంది.
ఈ రెండు ఫేమస్ కార్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది.
మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ రెండూ ప్రారంభ ధర రూ. 10 లక్షల కంటే తక్కువ.


మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌ల మధ్య తేడాలు...
మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌లకు కొన్ని సారూప్యతలు, చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండు వాహనాల ఇంజిన్‌లో అతిపెద్ద వ్యత్యాసం అదే. అలాగే సెక్యూరిటీ ఫీచర్లలో కూడా చాలా తేడాలు ఉన్నాయి.


మారుతి బ్రెజ్జా ఒక హైబ్రిడ్ కారు. ఈ కారు కే15సీ పెట్రోల్ + సీఎన్‌జీ (బై ఫ్యూయల్) ఇంజిన్‌తో వస్తుంది. దీని కారణంగా ఈ కారును పెట్రోల్, సీఎన్‌జీ మోడ్‌ల్లో నడపవచ్చు. ఈ కారులో అమర్చిన ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 100.6 పీఎస్ పవర్, 4,400 ఆర్‌పీఎమ్ వద్ద 136 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ కారు 5,500 ఆర్పీఎం వద్ద 87.8 పీఎస్ శక్తిని, 4,200 ఆర్పీఎం వద్ద 121.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మారుతి కారు కిలోకు 25.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.



Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!


టాటా నెక్సాన్ హైబ్రిడ్ కారు కాదు. కానీ ఈ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్లలో వస్తుంది. ఈ టాటా కారులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5,500 ఆర్‌పీఎమ్ వద్ద 88.2 పీఎస్ పవర్, 1,750 నుంచి 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ 17 నుంచి 24 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.


టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మారుతి బ్రెజ్జా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా నెక్సాన్ 382 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. మారుతి బ్రెజ్జా 328 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.


దేని ధర ఎలా ఉంది?
టాటా నెక్సాన్ ఇండియన్ మార్కెట్లో మొత్తం 100 వేరియంట్‌లను కలిగి ఉంది. ఈ టాటా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి మొదలై రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు మారుతి బ్రెజ్జా ధర రూ. 8.34 లక్షల నుంచి మొదలవుతుంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.14 లక్షల వరకు ఉంది.



Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!