Maruti Fronx Hybrid Price, Mileage And Features: మారుతి సుజుకి, తన ప్రసిద్ధ ఫ్రాంక్స్ SUV లో హైబ్రిడ్ వెర్షన్‌ను తెలుగు ప్రజలకు పరిచయం చేయబోతోంది. ఈ కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ను 2026 లో లాంచ్‌ చేయవచ్చు. లాంచ్‌ కంటే ముందు, "ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2026" లో ఈ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇటీవల, ఈ కారు గురుగావ్‌ రోడ్లపై టెస్టింగ్‌ టైమ్‌లో కనిపించింది. 

Continues below advertisement


కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌, ప్రస్తుతం ఉన్న పెట్రోల్ మోడల్ కంటే కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే దాదాపు రూ. 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, ప్రస్తుతం, ఫ్రాంక్స్ ధర 7.59 లక్షల నుంచి 12.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. దీని ఆధారంగా, ఫ్రాంక్స్‌ హైబ్రిడ్ వేరియంట్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు (Maruti Fronx Hybrid ex-showroom price, Hyderabad Vijayawada). విడిగా చూస్తే ఈ రేటు కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ, ఇతర కంపెనీల హైబ్రిడ్‌ SUV లతో పోలిస్తే ఇది చవకైన కారుగానే ఉంటుంది, మధ్య తరగతి కుటుంబాలకు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌ అవుతుంది.


మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ ఎంత మైలేజ్ ఇస్తుంది? 
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ కంపెనీ కొత్త 1.2 లీటర్ Z12E మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రోడ్డుపై వేగంగా పరుగులు తీస్తుంది. ఇది బలమైన హైబ్రిడ్ వ్యవస్థతో పని చేస్తుంది. సిరీస్ హైబ్రిడ్ సెటప్, దీనిలో పెట్రోల్ ఇంజిన్, కారు బ్యాటరీని ఛార్జ్ చేస్తే & కారులోని ఎలక్ట్రిక్ మోటారు చక్రాలకు శక్తినిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ సాయంతో, ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 30-35 కి.మీ.కు (Maruti Fronx Hybrid Mileage) చేరుకుంటుంది. ఈ నంబర్‌, ప్రస్తుత పెట్రోల్ వెర్షన్ (20.01–22.89 కి.మీ/లీటర్) & CNG వేరియంట్ (28.51 కి.మీ/కి.మీ) కంటే చాలా మెరుగ్గా ఉంది.


ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ ఫీచర్లు & సాంకేతికత
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో చాలా ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు. 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు సన్‌రూఫ్ కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ, ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ టాప్-ఎండ్‌ మోడల్‌లో లెవల్-1 ADAS ఫీచర్‌ను కూడా చేర్చవచ్చు. ఈ వ్యవస్థ కారులోని కుటుంబ సభ్యులకు మరింత రక్షణ ఇస్తుంది & డ్రైవింగ్‌ను కూడా సులభంగా మారుస్తుంది.


మారుతి సుజుకీ, ఇటీవల, సేఫ్టీ ఫీచర్లను మెరుగు పరచడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో, ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ ప్రస్తుత మోడల్ మాదిరిగానే సేఫ్టీ ఫీచర్లతో బలంగా ఉంటుంది. కొత్త మోడల్‌లో 6 ఎయిర్‌ బ్యాగులు (స్టాండర్డ్), EBD తో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ & కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండవచ్చు.