Mahindra XUV 3XO: మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ పేరును వెల్లడించింది. దీన్ని ఎక్స్‌యూవీ300కి సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్ అని పిలుస్తున్నారు. మహీంద్రా ఇందులో చాలా అప్‌డేట్స్ చేసింది. ముఖ్యంగా లుక్స్, ఫీచర్ల పరంగా ఇందులో చాలా అప్‌గ్రేడ్లు చూడవచ్చు. ఈ కారుకు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO) అని పేరు పెట్టారు. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో లుక్ కూడా మునుపటి వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఒక షార్ప్ లుక్‌తో కొత్త ఫ్రంట్ ఎండ్‌ను పొందుతుంది. ఇందులో కొత్త గ్రిల్ కూడా అందించారు. ఇది కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను కూడా ఇది కలిగి ఉంది. దీని బంపర్ కూడా పూర్తిగా కొత్తగా ఉంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ కారు గ్లోబల్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
కొత్త ఫీచర్లు కూడా...
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో గ్లింప్స్‌లో వెనుక స్టైలింగ్‌ను కూడా చూడవచ్చు. ఇది వెనుకవైపు ఫుల్లీ వైడ్ లైట్ బార్, కొత్త టెయిల్‌గేట్‌ను కలిగి ఉంది. ఎక్స్‌యూవీ400 కాకుండా కొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది డార్క్ గ్రే కలర్ ఫినిషింగ్‌తో కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది.
దీని ఇంటీరియర్ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటాయి. కొత్త కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో అందించనున్నారు. అయితే ఒక ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో కొత్తగా ఉంటుంది. అదే పనోరమిక్ సన్‌రూఫ్. సబ్ 4 మీటర్ ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి.
ఇంజిన్ ఇలా...
ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇప్పటికే ఉన్న లైనప్‌ను ఇది ముందుకు తీసుకువెళుతుంది. అయితే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే మాన్యువల్, ఆటోమేటిక్ అలాగే ఇతర పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త మహీంద్రా ఎస్‌యూవీ... టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్లతో పోటీపడుతుంది.