Mahindra XUV 3XO Vs XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎస్‌యూవీ ఏప్రిల్ 29వ తేదీన మనదేశంలో లాంచ్ అయింది. కొన్ని డీలర్‌షిప్స్ అయితే దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా తీసుకోవడం ప్రారంభించాయి. మహీంద్రా బ్లాక్‌బస్టర్ కారు ఎక్స్‌యూవీ300కు తర్వాతి వెర్షన్‌గా ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది. మరి ఫీచర్ల పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ300కు, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోకు మధ్యలో ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.
పనోరమిక్ సన్‌రూఫ్
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో సెగ్మెంట్ ఫస్ట్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుందని అధికారిక టీజర్ ద్వారా కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌యూవీ300 కూడా సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. అయితే ఇది సింగిల్ పేన్ యూనిట్. అందువల్ల ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో... దాని సెగ్మెంట్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పొందిన మొదటి ఎస్‌యూవీ అవుతుంది.
పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని భావిస్తున్నారు. వాయిస్ కమాండ్, కనెక్టెడ్ కారు టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ యూనిట్ ఆల్ ఎలక్ట్రిక్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 తాజా వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఎక్స్‌యూవీ300 గురించి చెప్పాలంటే ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంను స్టాండర్డ్‌గా అందించారు.
ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఎక్స్‌యూవీ300 ప్రస్తుత మోడల్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. అయితే ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో... మహీంద్రా ఎక్స్‌యూవీ400లో అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయనున్న 10.25 అంగుళాల ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రానుందని సమాచారం.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రీమియం ఆఫర్‌గా ఉండటానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో మార్కెట్లోకి. ఈ ఫీచర్‌ని టాప్ ఎండ్ వేరియంట్‌ల్లో అందించే అవకాశం ఉంది. ఎక్స్‌యూవీ300లో వెంటిలేటెడ్ సీట్లు అందించలేదు. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ఈ విభాగంలోని కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి అనేక ఇతర ఎస్‌యూవీల్లో అందుబాటులో ఉంది.
వైర్‌లెస్ ఛార్జింగ్
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వైర్‌లెస్ ఛార్జర్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ తరహా వైర్ లెస్ ఛార్జర్ ఎక్స్‌యూవీ300లో అందుబాటులో లేదు. కానీ ఈ ఫీచర్ ఎక్స్‌యూవీ400 ఈవీలో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో కూడా అందించనున్నారు.