Manchu Lakshmi Mumbai Home Tour: మంచు లక్ష్మి.. తన డైలీ లైఫ్‌లో జరిగే విషయాలను, తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను.. అన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. అంతే కాకుండా తన అప్డేట్స్ గురించి యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా తాను ముంబాయ్‌కు షిఫ్ట్ అయిపోయాను అని చెప్తూ అక్కడి హోమ్ టూర్ వీడియో ఒకటి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది. దీంతో అసలు మంచు లక్ష్మి ముంబాయ్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యింది అని ఆశ్చర్యపోవడంతో పాటు తన ఇల్లు చూసి కూడా షాక్ అవుతున్నారు సబ్‌స్క్రైబర్స్. 


పాత సామాన్లే..


తను చేసిన హోమ్ టూర్ వీడియోలను ప్రేక్షకులు బాగా ఆదరించారని ముందుగా గుర్తుచేసుకుంది మంచు లక్ష్మి. ఆ తర్వాత హైదరాబాద్‌లో తన ఇల్లు, తన తండ్రి మోహన్ బాబు ఇంటికి కూడా సబ్‌స్క్రైబర్లకు ముందే చూపించానని చెప్పుకొచ్చింది. ఇక ముంబాయ్ షిఫ్ట్ అయిపోయాను కాబట్టి ఇక్కడి ఇల్లు కూడా చూసేయండి అంటూ తన హోమ్ టూర్ వీడియోను ప్రారంభించింది. అయితే తన హైదరాబాద్ ఇంటి నుండే చాలావరకు ఫర్నీచర్‌ను ముంబాయ్‌కు తెచ్చుకున్నానని, అత్యవసరమైతే తప్పా ఎక్కువ ఫర్నీచర్‌ను కొనదలచుకోలేదని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఇక తన దగ్గర దాదాపుగా 160 ఇన్‌డోర్ మొక్కలు ఉన్నాయని తెలిపింది. మొక్కల వల్ల ఇంటికి కొత్త లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


చుట్టూ బాల్కనీ..


ముంబాయ్‌లో తనకు అలాంటి ఇల్లు దొరకడం అనేది తన అదృష్టమని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. దేవుడే తన చేయి పట్టుకొని తీసుకొచ్చాడని లేకపోతే ఇలా జరగడం అసంభవం అని తెలిపింది. దాదాపు 28 ఇళ్లు చూసిన తర్వాత తనకు అలాంటి ఇల్లు దొరికిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంది. ఆ ఇంటి చుట్టూ బాల్కనీ ఉందని, అదే ఆ ఇంటి స్పెషాలిటీ అని చెప్పింది. తన హాల్‌లో ఒక చోటులో మాత్రం ఎక్కువ గ్రీనరీ ఉండేలా చూసుకుంది లక్ష్మి. చుట్టూ మొక్కలను పెట్టి, సోఫాలకు కూడా గ్రీన్ కలర్ ఏర్పాటు చేసింది. ఎక్కువమంది వచ్చినప్పుడు కూర్చొని కబుర్లు చెప్పడానికి బాగుంటుందని అలా ప్లాన్ చేశానని చెప్పింది. తన పాత ఇంటి నుంచి తెచ్చుకున్న పెయింటింగ్స్‌ను కూడా మరోసారి సబ్‌స్క్రైబర్స్‌కు చూపించింది.



రెగ్యులర్‌గా టచ్‌లో ఉండం..


ఆ తర్వాత తన ఆఫీస్ రూమ్‌ను ఎలా సెట్ చేసుకుందో చూపించింది మంచు లక్ష్మి. ఆ రూమ్‌లో మాత్రం గోడలపై ఎక్కువగా పెయింటింగ్స్, ఫోటోలు ఏమీ పెట్టలేదు. కానీ తన రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కారిడార్‌లో తనకు నచ్చిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. అందరితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండకపోయినా ఆ ఫోటోలు చూసుకున్నప్పుడు అందరితో ఇంకా క్లోజ్‌గా ఉన్నట్టు అనిపిస్తుందని తెలిపింది. ఇల్లు మొత్తం ఉన్న లైట్లను తన మొబైల్‌తోనే ఆపరేట్ చేసేలాగా ఏర్పాటు చేసుకుంది. ఇక తను హైదరాబాద్ నుంచి ముంబాయ్ షిఫ్ట్ అయ్యే క్రమంలో తనకు సాయం చేసిన వారందరినీ గుర్తుచేసుకొని థ్యాంక్స్ చెప్పుకుంది మంచు లక్ష్మి. ఇండియాలో అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తనకు తెలియదని, ఇది తన జీవితంలో కొత్త అనుభవం అని చెప్తూ వీడియోను ముగించింది.



Also Read: తండ్రయిన మంచు మనోజ్‌ - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మౌనిక రెడ్డి