Mahindra Thar ROXX Features: మహీంద్రా థార్ రోక్స్ భారతీయ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మహీంద్రా కారు లాంచ్ గురించి మార్కెట్లో చాలా బజ్ ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి కొత్త థార్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లపైనే ఉంది. దాని 3 డోర్ మోడల్లో లేని ఫీచర్లను ఇందులో చూడవచ్చని తెలుస్తోంది. మహీంద్రా కొద్ది రోజుల క్రితం థార్ రోక్స్ విడుదల తేదీని ప్రకటించింది. మహీంద్రా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది. కొత్త థార్ 4*4 డీజిల్, పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. మహీంద్రా రూపొందించిన ఈ కారు ప్రీమియం ఎస్‌యూవీ అవుతుంది.
మహీంద్రా థార్ రోక్స్‌లో కనిపించనున్న టాప్ 5 ఫీచర్లు ఇవే...
1. టచ్‌స్క్రీన్
మహీంద్రా థార్ రోక్స్ 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లను పొందవచ్చు. కానీ అవి ఎక్స్‌యూవీ700 లాగా కనెక్టెడ్ కాదు. కొత్త థార్‌లో కనిపించే స్క్రీన్ 3 డోర్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త థార్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చు. మహీంద్రా థార్ రోక్స్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం అయింది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
2. 360 డిగ్రీ కెమెరా
కొత్త థార్ కూడా 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఎస్‌యూవీలో ఈ ఫీచర్‌ను పొందడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ ఫీచర్ మహీంద్రా స్కార్పియో ఎన్‌లో కూడా కనిపించలేదు. ఈ ఫీచర్ పెద్ద థార్ రోక్స్‌ను సరిగ్గా పార్కింగ్ చేయడంలో సహాయపడుతుంది.
3. పనోరమిక్ సన్‌రూఫ్
మహీంద్రా థార్ రాక్స్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ 3 డోర్ మోడల్‌లో కూడా కనిపించలేదు. రోక్స్ మెటల్ హార్డ్‌టాప్ రూఫ్‌ను కూడా పొందనుంది.
4. ఏడీఏఎస్ లెవల్ 2
మహీంద్రా లాంచ్ చేయనున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ కూడా చూడవచ్చు. ఎక్స్‌యూవీ700తో పోలిస్తే ఈ ఎస్‌యూవీలో మరిన్ని తాజా ఫీచర్లను చేర్చవచ్చు.
5. సెక్యూరిటీ ఫీచర్లు
రియర్ ఏసీ వెంట్లను థార్ రోక్స్‌లో కూడా చూడవచ్చు. కారులో ముందు, వెనుక ఆర్మ్‌రెస్ట్‌లను కూడా అందించవచ్చు. ఈ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కంపెనీ అమర్చనుందని సమాచారం. అలాగే సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందించవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే