Tata Curvv EV Vs BYD Atto 3 Car Comparison: టాటా కర్వ్ ఈవీని కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. బీవైడీ అట్టో 3తో టాటా కర్వ్ ఈవీ పోటీపడనుంది. మీరు ఈ రెండు కార్లలో ఒకదానిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే వీటిలో ఏది బెస్ట్ అని తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఈ రెండిటి మధ్య పోలికలు ఏంటి? తేడాలు ఏంటి? ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా కర్వ్ కారులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ కారు acti.ev ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు పొడవు 4310 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1810 మిల్లీమీటర్లుగా ఉంది. దీంతో పాటు ఈ కారు 2560 మిల్లీమీటర్ల వీల్ బేస్ కలిగి ఉంది. ఈ కారులో 500 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. ఇందులో మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్, కనెక్టెడ్ యాప్, ఎల్ఈడీ లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు అందించారు.
బీవైడీ అట్టో 3లో 18 అంగుళాల టైర్ ఆప్షన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, హీటెడ్ అడ్జస్టబుల్ మిర్రర్స్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, ఆటో ఏసీ, రియర్ ఏసీ వెంట్స్, ఆటో హెడ్‌ల్యాంప్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కీలెస్ ఎంట్రీ, టైర్ రిపేర్ కిట్ వంటి ఫీచర్లను పొందుతారు. దీంతో పాటు 12.8 అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్, ఎనిమిది స్పీకర్లు, యాపిల్ కార్ ప్లే, ఎల్ఈడీ లైట్లు, యాంబియంట్ లైట్, ఐదు అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4 వే పవర్డ్ కో-ప్యాసింజర్ డ్రైవర్ సీటు కూడా ఇందులో ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్లలో ఏది బెస్ట్?
ఇప్పుడు రెండు కార్లలోని సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. టాటా కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది కాకుండా త్రీ పాయింట్ ఈఎల్ఆర్, సీట్‌బెల్ట్ యాంకర్ ప్రీ-టెన్షనర్, ఫోర్టిఫైడ్ బాడీ స్ట్రక్చర్, లెవల్-2 ఏడీఏఎస్, ఈఎస్‌పీ, ఈపీబీ, 360 సరౌండ్ వ్యూ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌తో కూడిన 20 సేఫ్టీ ఫీచర్‌లను కలిగి ఉంది.
బీవైడీ అట్టో 3 ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఈఎస్‌పీ, ఈపీబీ, ఏబీఎస్, ఈబీడీ, స్టాప్ అండ్ గో ఫుల్ స్పీడ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హిల్ అసిస్ట్, టీపీఎంఎస్, ఏడీఏఎస్, డిస్క్ బ్రేక్‌లు వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.
దేని రేంజ్ ఎంత?
టాటా నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మొదటిది 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 502 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని, 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఇది సింగిల్ ఛార్జింగ్‌లో 585 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
బీవైడీ అట్టో 3లో 49.92 కేడబ్ల్యూహెచ్, 60.48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో మొదటిది 468 కిలోమీటర్లు, రెండోది 521 కిలోమీటర్ల రేంజ్‌ని పొందుతుంది. సాధారణ ఛార్జర్ నుంచి ఛార్జ్ చేయడానికి 8 నుంచి 10 గంటలు పడుతుంది. అయితే డీసీ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 50 నిమిషాలు పడుతుంది.
దేని ధర ఎంత?
టాటా కర్వ్ ఈవీ రూ. 17.49 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. దీని టాప్ వేరియంట్ ధర రూ.21.99 లక్షలుగా నిర్ణయించారు. బీవైడీ అట్టో 3 బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 24.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 33.99 లక్షలుగా ఉంది.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి