మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన స్కార్పియో N సేఫ్టీ విషయంలో మంచి ప్రతిభ కనబర్చింది. కొత్త GNCAP క్రాష్ టెస్ట్ రేటింగ్ ప్రోటోకాల్‌  ప్రకారం 5 స్టార్స్ స్కోర్ చేసింది. తాజాగా అప్ డేట్ చేయబడిని గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ల ప్రకారం ఈ టెస్ట్ జరిగింది. కఠినమైన ప్రోటోకాల్‌ ప్రకారం సరికొత్త గుర్తింపు దక్కించుకుంది.  మహీంద్రా స్కార్పియో-ఎన్ పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం ఐదు స్టార్‌లను సాధించగా,  పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం మూడు స్టార్‌లను స్కోర్ చేసింది.


మహీంద్రా స్కార్పియో-N బేసిక వేరియంట్‌ లో రెండు ఫ్రంటల్ ఎయిర్‌ బ్యాగ్‌ లు, ABSతో అమర్చబడిన బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ తో పరీక్షించబడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సైడ్ కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌లు ప్రామాణికం కాకపోయినా, ఉత్పత్తి చేయబడిన మెజారిటీ యూనిట్లలో కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి.


పెద్దల భద్రతలో 5 స్టార్స్, పిల్లల భద్రలతో 3 స్టార్స్


త్రీ-పాయింట్ సీట్‌ బెల్ట్‌ లు లేకపోవడం పిల్లల సేఫ్టీ విషయంలో తక్కువ రేటింగ్ సాధించింది. పిల్లల భద్రత విషయంలో కేవలం 3 స్టార్స్ కే పరిమితం అయ్యింది.  గ్లోబల్ NCAP లేటెస్ట్ న ప్రోటోకాల్స్ లో భాగంగా ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), పాదచారుల రక్షణ, సైడ్ ఇంపాక్ట్ పోల్ ప్రొటెక్షన్ అసెస్‌మెంట్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ రేటింగ్ సంపాదించింది. స్కార్పియో N 5-స్టార్ రేటింగ్‌ను పొందిన మొదటి ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్-అమర్చిన SUVగా గుర్తింపు దక్కించుకుంది.


5 స్టార్ రేటింగ్ పొందిన మూడో SUV


జూన్‌లో ప్రారంభించబడిన స్కార్పియో N, మహీంద్రా XUV700,XUV300 తర్వాత 5-స్టార్ రేటింగ్‌ను పొందిన మూడవ SUVగా నిలిచింది. మహీంద్రా XUV300, 2021లో XUV700 ఆ తర్వాత 5-స్టార్ అడల్ట్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించిన మహీంద్రా SUVలుగా గుర్తింపు పొందాయి. అటు మహీంద్రా ఇతర బాడీ-ఆన్-ఫ్రేమ్ వాహనాలు  థార్ 2020లో, మరాజో 2018లో 4-స్టార్ రేటింగ్‌ను పొందాయి.  


డీజిల్, పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్స్ లో స్కార్పియో N


స్కార్పియో N డీజిల్, పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్స్ తో లభిస్తోంది.  అయితే Z2, Z4, Z6, Z8, Z8L వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. డీజిల్ 4x4 సిస్టమ్‌ను పొందుతుంది.


 స్కార్పియో Nలో భద్రతకు పెద్దపీట


స్కార్పియో ఎన్‌లో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, డ్రైవర్ డ్రస్‌నెస్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) + EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్), హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ ఉన్నాయి. నియంత్రణ (VDC), రోల్ ఓవర్ మిటిగేషన్ (ROM), వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు (ముందు + వెనుక), ISOFIX/ i-SIZEతో వస్తోంది. అటు మహీంద్రా తన XUV400 EVని త్వరలో విడుదల చేయాలని యోచిస్తోంది.


Read Also: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన