ABP  WhatsApp

Kill Modi Remark: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు- 24 గంటల్లో కాంగ్రెస్ నేత అరెస్ట్!

ABP Desam Updated at: 13 Dec 2022 04:15 PM (IST)
Edited By: Murali Krishna

Kill Modi Remark: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

(Image Source: Twitter)

NEXT PREV

Kill Modi Remark: ప్రధాని నరేంద్ర మోదీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






మధ్యప్రదేశ్‌లోని దమొహ్ జిల్లాలోని తన నివాసంలో పన్నా పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. "రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రధాని మోదీని చంపండి" అని రాజా పటేరియా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సోమవారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 


ఏమన్నారంటే 


పన్నా జిల్లాలోని పవాయి పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.







మోదీ ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తారు. కులం, మతం, భాష ఆధారంగా ప్రజల్ని విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఒకవేళ మీరు రాజ్యాంగాన్ని కాపాడాలి అనుకుంటే మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి. చంపడం అంటే ఆయన్ను ఓడించడం.                                       -    రాజా పటేరియా, కాంగ్రెస్ నేత        


ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో పటేరియా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించానని, మోదీని చంపమని చెప్పడం తన ఉద్దేశం కాదన్నారు. 


దుమారం


ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్‌పై భాజపా నేతలు విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాఖ్యలను ఖండించారు.



రాజకీయంగా మోదీతో పోటి పడే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే కాంగ్రెస్ నాయకులు మోదీని చంపడం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. ఆయనపై కేసు నమోదైంది. చట్టప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి.                                      - శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం


Also Read: India-China Border Clash: అసలు సరిహద్దులో ఏం జరిగింది? చైనాకు ఇంకా బుద్ధి రాలేదా?

Published at: 13 Dec 2022 04:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.