Mahindra Scorpio Discount Offer: భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్‌ని విడుదల చేసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే మహీంద్రా ఇప్పుడు స్కార్పియో ఎన్ ఎంవై2023 యూనిట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. వివిధ ట్రిమ్‌లను బట్టి స్కార్పియో ఎన్ కొనుగోలుపై రూ. లక్ష వరకు నగదు తగ్గింపును అందిస్తున్నారు.
మహీంద్రా స్కార్పియో ఎన్‌పై తగ్గింపు
స్కార్పియో ఎన్ టాప్ స్పెక్ జెడ్8, జెడ్8ఎల్ డీజిల్ 4x4 వేరియంట్‌లు, మాన్యువల్, ఆటోమేటిక్ రెండూ... ఈ నెలలో రూ. లక్ష ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందుతున్నాయి. అయితే ఇది 7 సీటర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే జెడ్8, జెడ్8ఎల్ డీజిల్ 4x2 ఏటీ వేరియంట్‌లను (6. 7 సీటర్లు రెండూ) రూ. 60,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా జెడ్8, జెడ్8ఎల్ పెట్రోల్ ఏటీ వేరియంట్‌లు కూడా 6, 7 సీటర్ వేరియంట్‌లకు రూ. 60,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ వేరియంట్‌పైనా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ ఆఫర్ లేదు.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంజిన్
స్కార్పియో ఎన్ రెండు ఇంజన్ ఆప్షన్లను పొందుతుంది. 203 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 175 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసతే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్. రెండింటినీ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తొ కొనుగోలు చేయవచ్చు. స్కార్పియో ఎన్ రియర్ వీల్ డ్రైవ్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే 4 వీల్ డ్రైవ్ డీజిల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది.
ధర ఎంతంటే?
ప్రస్తుతం స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.60 లక్షల నుంచి రూ.24.54 లక్షల మధ్య ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు. కానీ దాని ధర, డిజైన్ కారణంగా ఇది టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లతో పోటీపడుతుంది.