MG Comet EV Price Hike: ఎంజీ మోటార్స్ తన చవకైన ఎస్‌యూవీ ధరను పెంచింది. ఎంజీ కామెట్ ఈవీ ధర ఇప్పుడు రూ.10 వేలు పెరిగింది. ఎంజీ కంపెనీ ఈ కారు అన్ని వేరియంట్లకు సంబంధించి కొత్త ధరలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో ఈ ఎస్‌యూవీ ధర పెరగడంతో దాని కస్టమర్లు షాక్ అయ్యారు. ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీకి సంబంధించి ఒక వేరియంట్ మినహా అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. కొత్త ధరలు ప్రకటించిన తర్వాత ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి మొదలై రూ. 9.24 లక్షల వరకు చేరుకుంటుంది.


మూడు వేరియంట్లలో ఎంజీ కామెట్...
ఎంజీ కామెట్ ఈవీకి సంబంధించి మూడు వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లు ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్. వీటిలో ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్ వేరియంట్‌లలో ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంజీ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధరను మాత్రమే మార్చలేదు. ఎంజీ కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6,98,800గా ఉంది.






వేటి ధర ఎంత పెరిగింది?
ఎంజీ కామెట్ ఈవీ ధరల పెరుగుదల తర్వాత కొత్త రేట్లు బయటకు వచ్చాయి. కామెట్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.98 లక్షలుగా మారింది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8,33,800కు పెరిగింది. కామెట్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర కూడా పెరిగింది. రేట్లు పెరిగిన తర్వాత దీని ధర రూ.8.88 లక్షలుగా చేరింది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ ధర రూ.9,23,800గా ఉంది.


దీని పవర్, రేంజ్ ఎంత?
ఎంజీ కామెట్ ఈవీలోని 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెనుక వైపు యాక్సిల్ మౌంటెడ్ సింగిల్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ కామెట్ ఈవీ 41 హెచ్‌పీ పవర్‌ని, 110 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఈవీలో ఛార్జింగ్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఇది 7.4 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. దీని ద్వారా 2.5 గంటల్లో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 230 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. కానీ రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్‌లో ఈ కారు 191 కిలోమీటర్ల రేంజ్‌ను అందించింది. 


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!