Layoffs in Apple: యాపిల్ కంపెనీ మరోసారి లేఆఫ్‌లకు (Apple Layoffs) సిద్ధమైంది. కొన్ని ప్రాజెక్ట్‌లని పూర్తిగా రద్దు చేసింది. ఫలితంగా...ఆ ప్రాజెక్ట్‌లలోని ఎంప్లాయీస్‌ని తొలగించింది. దాదాపు 600 మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. కాలిఫోర్నియాలో ఈ లేఆఫ్‌లు చేపట్టినట్టు వెల్లడించింది. కార్, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్ట్‌లు నిలిపివేస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తోందని ఇటీవలే కొందరు ఎగ్జిగ్యూటివ్ స్థాయి ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచే ఈ డిపార్ట్‌మెంట్‌లలో పని తగ్గిపోయింది. ఇంజనీరింగ్, సప్లైయర్, కాస్ట్ ఛాలెంజెస్ సవాళ్లు ఎదురవుతున్నాయని స్పష్టం చేసింది కంపెనీ. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం...శాంటాక్లారాలోని ఆఫీస్‌లో యాపిల్ కార్ ప్రాజెక్ట్ నుంచి 371 మంది ఉద్యోగులను తొలగించారు. మరికొన్ని శాటిలైట్ ఆఫీస్‌లలోని ఉద్యోగులపైనా ఈ ఎఫెక్ట్ పడుతోంది. అయితే...ఆయా విభాగాల్లోని ఉద్యోగులను వేరే డిపార్ట్‌మెంట్‌లకు తరలిస్తోంది కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, పర్సనల్ రోబోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లకు తరలిస్తున్నట్టు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌లోనూ యాపిల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది.