Toyota Hyryder Price, Down Payment, Loan and EMI Details: టయోటా అర్బన్ క్రూయిజర్ 'హైరైడర్' ఒక హైబ్రిడ్ SUV. ఇది ఒక మెరుగైన ఇంధన సామర్థ్యం ఉన్న కారు. అంటే, ఇంధనాన్ని పొదుపుగా వాడుకుని ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది. అంతేకాదు, ఆకర్షణీయమైన రూపం కారణంగానూ ఇది చాలా మందికి నచ్చుతుంది. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఈ SUVని కొనుగోలు చేయాలనుకుంటే, ఏ నగరంలో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. Toyota Urban Cruiser Hyryder ఎక్స్-షోరూమ్ ధర (Toyota Hyryder ex-showroom price) రూ. 11.34 లక్షల నుంచి ప్రారంభమై, హై-ఎండ్‌ వెర్షన్‌కు రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. దీని బలమైన హైబ్రిడ్ వేరియంట్ (S Hybrid) రూ. 16.81 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.

Continues below advertisement


తెలుగు రాష్ట్రాల్లో ధర
తెలుగు రాష్ట్రాల్లో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ SUV బేస్‌ వేరియంట్‌ 'E NeoDrive' ఆన్‌-రోడ్‌ రేటు (Toyota Hyryder on-road price) దాదాపు రూ. 13.96 లక్షలు. హైదరాబాద్‌ లేదా విజయవాడ లేదా తెలుగు రాష్ట్రాల్లోని ఏ నగరంలో కొన్నప్పటికీ, కొద్ది వ్యత్యాసంతో దాదాపు ఇదే ధర ఉంటుంది. E NeoDrive ఆన్‌-రోడ్‌ ధరలో - రిజిస్ట్రేషన్‌ ఖర్చు దాదాపు రూ. 1.98 లక్షలు, ఇన్సూరెన్స్‌ దాదాపు రూ. 50 వేలు, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.


ఇతర రాష్ట్రాల్లో ధర
దిల్లీలో, టయోటా హైరైడర్ E NeoDrive మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ ఆన్‌-రోడ్‌ రేటు ధర రూ.13.29 లక్షలు. తమిళనాడులో రూ. 14.24 లక్షలు, కర్ణాటకలో రూ. 14.25 లక్షలు, కేరళలో రూ. 13.70 లక్షలు, ముంబయిలో రూ. 13.50 లక్షలు, పుణెలోనూ రూ. 13.50 లక్షలు, నోయిడాలో రూ.13.49 లక్షలు రేటు పలుకుతుంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? 
మీరు, తెలుగు రాష్ట్రాల్లో టయోటా హైరైడర్ E NeoDrive వేరియంట్‌ను కార్‌ లోన్ మీద కొనాలనుకుంటే, కనీసం రూ. 2.5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన డబ్బును కార్‌ లోన్‌గా తీసుకోవాలి. కార్‌ లోన్‌ మీద బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ రేటు ప్రకారం, నెలవారీ EMI చెల్లిస్తే సరిపోతుంది.


టయోటా హైరైడర్ ఫీచర్లు
హైరైడర్ SUVలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ & 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి, కస్టమర్‌ను సంతోషపెడతాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌ బ్యాగులు & 360-డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. 


హైరైడర్ SUV మూడు ఇంజిన్ ఎంపికలతో (1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) & 1.5-లీటర్ CNG ఇంజన్) అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & e-CVT ఉన్నాయి. 


హైరైడర్ SUV మైలేజ్‌
పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ 1 లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. CNG వేరియంట్ మైలేజ్ కిలోగ్రాముకు 26.6 కిలోమీటర్లుగా పేర్కొంది.


వేరియంట్ & నగరాన్ని బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు. కారు లోన్‌ & వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం మీరు సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.