Kinetic E-Luna: ఒకదాని తర్వాత ఒకటి ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో వేగంగా ముందుకు సాగడమే కాకుండా తమ ప్రసిద్ధ వాహనాల ఈవీ వేరియంట్‌లను విడుదల చేయడంలో బిజీగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ప్రసిద్ధ మోపెడ్ అయిన కైనెటిక్ లూనా కూడా ఈ జాబితాలో చేరనుంది. త్వరలో దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ అవతార్‌ లాంచ్ కానుంది.


ఈవీ కంపెనీ కైనెటిక్ గ్రీన్ వచ్చే నెలలో అంటే 2024 ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ మోపెడ్ ఈ-లూనాను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని బుకింగ్ నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500తో ప్రారంభం అవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు దీన్ని బుక్ చేసుకోగలరు.


కైనెటిక్ లూనా బ్యాటరీ ప్యాక్/రేంజ్ ఎలా ఉండనుంది?
1970 నుంచి 2000 వరకు దేశీయ మార్కెట్లో లూనా ఒక ప్రసిద్ధ ద్విచక్ర వాహనంగా ఉంది. ఇది సాధారణ డిజైన్, ఎక్కువ మైలేజీ మొదలైన వాటికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ-లూనా అందించే ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు. ఈ-లూనాలో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ చూడవచ్చు. దాని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది.


కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఎలక్ట్రిక్ లూనా మెట్రో, టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలతో పాటుగా గ్రామీణ మార్కెట్లలోని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. పాత లూనా గ్రామాల్లోనే ఎక్కువగా కనిపించేది.


కైనెటివ్ లూనా ధర ఎంత ఉండవచ్చు?
ప్రస్తుతానికి దీని ధరకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటే దాని ధరను అగ్రెసివ్‌గా ఉంచవచ్చని భావిస్తున్నారు. తద్వారా ఇది మార్కెట్లో ఉన్న ఇతర బైక్‌లకు గట్టి పోటీని అందించగలదు.


మరోవైపు హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇటీవల రూ. 11 లక్షల ప్రారంభ ధరతో మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిట్ ఎస్‌యూవీ పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్లకు చాలా డిమాండ్ ఉందని హ్యుందాయ్ తెలిపింది. మొత్తం బుకింగ్‌లో ఏకంగా 55 శాతం వీటికే ఉండటం విశేషం. మిగతా ఆర్డర్లలో 45 శాతం డీజిల్ వేరియంట్లకు సంబంధించినవి. హ్యుందాయ్ క్రెటా కోసం ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు జరిగాయి. 2024లో హ్యుందాయ్ 65 శాతం అమ్మకాలు ఎస్‌యూవీల నుంచి వస్తాయని అంచనా. ఫేస్‌లిఫ్ట్ కాకుండా మామూలు వెర్షన్ మోడల్‌తో పోలిస్తే కొత్త క్రెటా ఎంట్రీ లెవల్ మోడల్ రూ.13,000, టాప్ ఎండ్ వేరియంట్లు రూ. 80,000 వరకు ధరలు పెరిగాయి. అప్‌డేట్ చేసిన మోడల్ లైనప్‌లో 19 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు, ఐదు గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!