Kia Seltos Diesel MT Launched: కియా ఇండియా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కొత్త  -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను విడుదల చేయడం ద్వారా తన సెల్టోస్ లైనప్‌ను విస్తరించింది. దీని ధర రూ. 12 లక్షల నుంచి రూ. 18.28 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలే. ఇప్పుడు సెల్టోస్ లైనప్‌లో మొత్తం 24 వేరియంట్‌లు ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొత్త డీజిల్ ట్రిమ్‌లు ఐదు ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. అవి HTE, HTK, HTK+, HTX, HTX+ వేరియంట్లు. ఇంతకుముందు ఇది 6 స్పీడ్ ఐఎంటీ, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం పీక్ టార్క్ అందించే డీజిల్ మోటారుతో మార్కెట్లోకి వచ్చింది.


భారతదేశంలో కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఇది కూడా ఒకటి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 2023 జూలైలో మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి దీని విక్రయాల సంఖ్య 65,000 యూనిట్లకు చేరుకుంది.
 
2019లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి ఇది దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో ఆరు లక్షల యూనిట్లను విక్రయించింది. వీటిలో భారతదేశంలోనే 51 శాతానికి పైగా విక్రయాలు జరిగాయి. వాస్తవానికి  ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ప్రతి 10 కియా కార్లలో ఒకటి సెల్టోస్ కావడం విశేషం.


అప్‌డేట్ చేసిన హ్యుందాయ్ క్రెటా లాంచ్ అయిన వెంటనే దక్షిణ కొరియా వాహన తయారీదారు కియా దాని మోడళ్ల కోసం ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను విస్తరించడం ప్రారంభించింది. ఇందులో ఇప్పుడు ఆరు డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ. 12.45 లక్షల నుంచి రూ. 18.74 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్నాయి.


కియా సెల్టోస్ ఫీచర్లు
కొత్త సెల్టోస్‌లో మొత్తం 32 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్‌లో 17 ఫీచర్లు, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం ట్విన్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, 18 అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతోపాటు డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉన్నాయి.


మరోవైపు కియా మోటార్స్ భారతీయ మార్కెట్ కోసం ఒక అద్భుతమైన విజన్‌ని తెలిపింది. సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది. కంపెనీ ఇటీవల మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను అందించింది. ఇటీవలే కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ అయింది. ఇది కాకుండా హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనం కూడా మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ ఇటీవలే భారతదేశంలో 'కియా క్లావిస్' పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీన్ని కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ కోసం కూడా ఉపయోగించవచ్చు. భారతదేశంలో కియా మొట్టమొదటి మోడల్ అయిన క్లావిస్ (ఏవై అనే కోడ్ నేమ్)తో కియా హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను అందించాలని అనుకుంటున్నారు.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!