Drugs Seized : రాచకొండ (Rachakonda) పోలీసులు భారీగా డ్రగ్స్(Drugs) ను  పట్టుకున్నారు. రాజస్థాన్ (Rajastan)నుంచి హైదరాబాద్ ( Hyderabad) కు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్వోటీ,  మీర్ పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు.  రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ (Cp) సుధీర్ బాబు (Sudheer Babu) మాట్లాడారు. రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్స్ కు బానిసైన వీరంతా...తర్వాత పెడ్లర్స్ గా మారిపోయారు. వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. రాజస్థాన్ లో గ్రామ్ హెరాయిన్ 5 వేలు, MDMA 4 వేలకు గ్రామ్ కొనుగోలు చేసి...హైదరాబాద్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. రాజస్థాన్ నుంచి ప్రయివేట్ ట్రావెల్ బస్ లో హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారు. 


డ్రగ్ పెడలర్స్ ఆస్తులు కూడా సీజ్ చేస్తాం
రాజస్థాన్ కు చెందిన నరేంద్ర బిష్ణోయ్, ప్రవీణ్ బిష్ణోయ్, హేమ రాం, ప్రకాష్ లు భాగ్యనగరంలో ఉంటూ రెయిలింగ్ పనులు చేస్తున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన ఈ నలుగురు...నగరంలో మత్తు పదార్థాలకు ఉన్న డిమాండ్ ను తెలుసుకున్నారు. నలుగురు రాజస్థాన్ లోని  డ్రగ్స్ వ్యాపారి నుంచి హెరాయిన్, MDMA, డ్రగ్స్ ను గ్రాము 2 నుంచి 4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని ప్రైవేటు బస్సులు, ఇతర ట్రాన్స్ పోర్టు వాహనాల్లో వాటిని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ప్రైవేట్ డెలివరీ ఏజెన్సీల ద్వారా రహస్యంగా డెలివరీ చేస్తున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత రాపిడో బైక్ సర్వీస్ ద్వారా కష్టమర్స్ కి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు.


గ్రాము 2 నుంచి 4వేలకు కొని...12వేలకు విక్రయం
గ్రాము 12వేల నుంచి  20 వేల వరకు అమ్ముతున్నారు. డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మీర్ పేట్ పోలీసులు...వర్షిణి ఫంక్షన్ హాల్ వద్ద నలుగురు పెడ్లర్లను అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై నిఘా ఉంచామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ డెన్ లను గుర్తించేందుకు...ఆయా రాష్ట్రాల్లోనే తిష్టవేసి పట్టుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక ఆపరేషన్ చేసి...డ్రగ్స్ వ్యాపారుల మూలాలను ధ్వంసం చేస్తామన్నారు. డ్రగ్స్ వ్యాపారులు, పెడ్లర్ల ఆస్తులను సైతం జప్తు చేస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. 


నకిలీ మందులను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
మరోవైపు  అంబర్ పేట్ లో పలు గో డౌన్లపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. ఆక్రమంగా మెడికల్ షాప్ లకు మందులు సరఫరా చేస్తున్న బషీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా సిటీలోని పలు మెడికల్ దుకాణాలకు మందుల విక్రయిస్తున్నాడు. గోడౌన్ నుంచి 20లక్షల 52 వేల రూపాయలు  విలువ చేసే మందులను స్వాధీనం  చేసుకున్నారు. ఢిల్లీలోని అష్లే ఫార్మాలో తయారైన మందులను అంబర్ పేట్ లో విక్రయిస్తున్నాడు  బషీర్. కొన్ని మందులు నకిలీవని గుర్తించిన పోలీసులు...బషీర్ ను అరెస్ట్ చేశారు.