Jaguar First Electric Car: దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటా 2008లో టాటా కోసం జాగ్వార్‌ను కొనుగోలు చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఫోర్డ్‌ రతన్ టాటాకు ఈ కంపెనీని విక్రయించింది. ఇప్పుడు టాటాకు చెందిన జాగ్వార్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించబోతోంది. ప్రారంభంలో జాగ్వార్ మూడు ఈవీ మోడళ్లను పరీక్షిస్తోంది. దీంతో పాటు జాగ్వార్ మొదటి ఈవీ 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రావచ్చని కూడా భావిస్తున్నారు.


జాగ్వార్ మొదటి ఫోర్ డోర్ ఎలక్ట్రిక్ సెడాన్ కాన్సెప్ట్ మోడల్ 2024 డిసెంబర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లాంచ్ కానుంది. ఈ కారు లాంచ్‌తో జాగ్వార్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఈ కారు గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న ఆడి ఈ ట్రాన్, పోర్షే టైకాన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. జాగ్వార్ ఈ కారు సరిగ్గా ఏ తేదీన లాంచ్ కానుందో ప్రకటించలేదు. జాగ్వార్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ కార్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. 



Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!


ఈ కార్లను నిలిపివేసిన జాగ్వార్
జాగ్వార్ ఇటీవల మార్కెట్లో చాలా కార్ల అమ్మకాలను నిలిపివేసింది. ఇప్పుడు జాగ్వార్ కంపెనీ వచ్చే నెలలో ఐ-పేస్, ఇ-పేస్ అమ్మకాలను నిలిపివేయబోతోంది. దీనికి ముందు ఎఫ్-టైప్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ కార్లను నిలిపివేయనుంది. జాగ్వార్ దగ్గ మిగిలి ఉన్న చివరి మోడల్ ఎఫ్-పేస్ కారును 2025 ప్రారంభంలో నిలిపివేయనున్నారు. దీనికి అర్థం జాగ్వార్ రాబోయే రెండేళ్ల వరకు మార్కెట్లో కొత్త మోడల్‌ను కలిగి ఉండదన్న మాట.


జాగ్వార్ ఇప్పుడు ఏం చేస్తుంది?
జాగ్వార్ ఎలక్ట్రిక్ కారుతో భారీ ప్రణాళికను అమలు చేయాలని అనుకుంటోంది. జాగ్వార్ లాంచ్ చేయనున్న ఈవీ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీతో పోటీ పడబోతోంది. ఈ వాహనం ఎలక్ట్రిక్ మోడల్ కమర్షియల్ వాహనాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. జాగ్వార్ మొదటి ఎలక్ట్రిక్ కారు చాలా ఎక్కువ ధరతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ఈ కారులో అన్ని సరికొత్త ఫీచర్లను పొందుపరచవచ్చు.



Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!