Most Vehicle Thefts in India: భారతదేశంలో కారు, బైకుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆకో కథనం ప్రకారం... 2023లో వాహనాలు పోయాయన్న ఫిర్యాదులు చాలా ఎక్కువ అయ్యాయి. ఏయే నగరాల్లో వాహనాలు ఎక్కువ పోయాయో కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.


ఢిల్లీలో ఎక్కువగా...
ఈ కథనం ప్రకారం ఢిల్లీలో ఎక్కువగా వాహనాలు పోతున్నాయి. రెండో స్థానంలో చెన్నై, మూడో స్థానంలో బెంగళూరు నిలిచాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలోనూ, ముంబై ఐదో స్థానంలోనూ, కోల్‌కతా ఆరో స్థానంలోనూ ఉన్నాయి. 


2023 సంవత్సరంలో ఢిల్లీలో ప్రతి రోజూ 105 వాహన కేసులు నమోదయ్యాయని ఈ కథనంలో పేర్కొన్నారు. సగటున ప్రతి 14 నిమిషాలకూ దేశ రాజధానిలో ఒక వాహనం పోతుందని తెలిపారు. ఢిల్లీలో కూడా ఉత్తమ్ నగర్, భజన్‌పుర, షాదారా, పత్పర్‌గంజ్ ప్రాంతాల్లో ఎక్కువగా వాహనాలు పోతున్నాయని, ఆ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


బిల్డింగ్స్‌లో, కాలనీల్లో పార్కింగ్ స్పేస్ తక్కువగా ఉందని, అందువల్లే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కేవలం వాహనాలను స్పేర్ పార్ట్స్ కోసం దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలను డిస్‌మాటిల్ చేసి విడి భాగాలను విక్రయిస్తూ ఉండటం వల్ల వాటిని ట్రాక్ చేయడం కూడా కష్టం.


మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే పాపులర్ వాహనాలను ఎక్కువగా చోరీ చేస్తున్నట్లు సమాచారం. మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్లకు చెందిన బెస్ట్ సెల్లింగ్ కార్లను దొంగలు ఎక్కువ చోరీ చేస్తున్నారట. వ్యాగర్ ఆర్, స్విఫ్ట్ కార్లు ఎక్కువగా చోరీ అయ్యే కార్లలో మొదటి రెండు కార్లలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ ఐ10 కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి డిజైన్ ఐదో స్థానంలో నిలిచింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!