Hyundai Sales Report 2024: హ్యుందాయ్ 2025 సంవత్సరం ప్రారంభంలో తన సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో గత సంవత్సరం కార్ల విక్రయాల గణాంకాలను పేర్కొంది. కంపెనీ గత ఏడాది రికార్డు స్థాయి పనితీరును కొనసాగించింది. హ్యుందాయ్ ఇండియా దేశీయంగా 6,05,433 యూనిట్లను విక్రయించింది.
ఈ అద్భుతమైన అమ్మకాలతో కంపెనీ భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మొదటి స్థానాన్ని సాధించింది. ఇది కాకుండా కంపెనీ మొత్తంగా 7,64,119 యూనిట్లను విదేశీ మార్కెట్లకు పంపింది. కంపెనీకి అద్భుతమైన కస్టమర్ బేస్ అందించిన కార్లలో క్రెటా, వెన్యూ, వెర్నా, ఎక్స్‌టర్ ఉన్నాయి.
గత నెలలో ఎంత అమ్మకాలు జరిగాయి?
గత నెల గణాంకాలను పరిశీలిస్తే హ్యుందాయ్ మొత్తం 55,078 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ మార్కెట్‌లో 42,208 యూనిట్లు విక్రయించగా, విదేశీ మార్కెట్‌కు 12,870 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. పెద్ద విషయం ఏమిటంటే హ్యుందాయ్ క్రెటా కంపెనీకి గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. గతేడాది క్రెటా మొత్తం 1,86,919 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
హ్యుందాయ్ క్రెటా అనేది కంపెనీ లాంచ్ చేసిన ఫేమస్ కారు. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. దీని బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.30 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ క్రెటా మూడు 1.5 లీటర్ ఇంజన్ వేరియంట్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.
ఈ ఫీచర్లు క్రెటాలో అందుబాటులో...
అప్‌డేటెడ్ క్రెటా 6 స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఏడీఏఎస్ లెవల్-2, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు సహ మరిన్ని ఫీచర్లను పొందుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అప్‌డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?