Hyundai Electric Car: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అనేక కార్ల తయారీదారులు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల వేరియంట్‌లను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. హ్యుందాయ్ కూడా ఈ రేసులో వెనక్కి తగ్గేదే లే అంటుంది. హ్యుందాయ్ మోటార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించింది. దీంతో పాటు హైబ్రిడ్ మోడ్‌లో వాహనాలను తీసుకురావడానికి కూడా హ్యుందాయ్ స్ట్రాటజీని సిద్ధం చేస్తోంది.
ఎలక్ట్రిక్ కార్లే టార్గెట్‌గా...
హ్యుందాయ్ మోటార్ రాబోయే సంవత్సరాల్లో కంపెనీ ప్లాన్లు వేయడంపై దృష్టి సారించింది. 2030 నాటికి 5.55 మిలియన్ వాహనాలను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం. అదే సమయంలో 5.55 మిలియన్ల కార్లలో రెండు మిలియన్ల యూనిట్లు ఎలక్ట్రిక్ వాహనాలు కావాలనేది హ్యుందాయ్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా 21 ఎలక్ట్రిక్ కార్లు...
హ్యుందాయ్ మోటార్ కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 900 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. 2030 నాటికి 21 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలన్నది కంపెనీ లక్ష్యం. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరను తగ్గించడంపైనా దృష్టి సారిస్తోంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
భారతదేశంలో కూడా...
హ్యుందాయ్ మోటార్ భారతదేశంలో ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురానుంది. కోనా, అయోనిక్ 5 తర్వాత కంపెనీ భారతీయ మార్కెట్లో మొట్టమొదటి మాస్ మార్కెట్ ఈవీని తీసుకురానుంది. హ్యుందాయ్ మోస్ట్ అవైటెడ్ కార్లలో క్రెటా ఈవీ కూడా ఒకటి కావచ్చు. క్రెటా ఈవీ మాత్రమే కాకుండా అనేక కొత్త మోడల్‌లను భారతీయ మార్కెట్లో చూడవచ్చు.
క్రెటా ఈవీ ప్రొడక్షన్ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది అంటే 2025లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. హ్యుందాయ్ ఇప్పుడు మరిన్ని ఈవీలపై పని చేస్తోంది. దీని వలన ప్రజలు వాటిని ఛార్జింగ్ చేసే విషయంలో కాస్త టెన్షన్ పడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లను ఫాస్ట్‌గా ఛార్జింగ్ చేసే టెక్నాలజీ ఇంకా భారతదేశంలో అందుబాటులోకి రాలేదు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే