30 North Korean officials sentenced to death తీవ్రమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కిమ్‌ను మించిన నాయకుడు లేడు. కిమ్ నియంత చర్యలు నిత్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. ఒక్కోసారి ఆయన చర్యలు ప్రపంచాన్నే వణికిస్తుంటాయి. తాజాగా ఉత్తర కొరియాలో 30 మంది అధికారులకు ఉరి శిక్ష విధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించారు. ఈ దారుణ నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
ఇటీవల ఉత్తర కొరియాలో తీవ్రమైన వర్షాలతోపాటు వరదలు ఆదేశాన్ని ముంచెత్తాయి. ఈ వరదల్లో దాదాపు 4 వేల మంది వరకు దేశ పౌరులు చనిపోయారు. దాదాపు మరో 5 వేల మంది వరకు నిరాశ్రయులయ్యారు. వరదల నివారణలో అప్రమత్తంగా ఉండటంలో అధికారులు విఫలమయ్యారని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కి అనిపించింది. కొండ చరియలు విరిగిపడి భారీగా దేశ పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలు కిమ్‌ను కదలించాయి. తక్షణ నివారణ చర్యలకు పూనుకున్నాడు. ఈ వరద ప్రభావాన్ని అడ్డుకోవడంలో అధికారుల వైఖరి కారణమని, వారు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లనే ఈ ఘోరం జరిగిందని కిమ్ గ్రహించారు. దీంతో ఈ దారుణ దుర్ఘటనకు కారణమైన 30 మంది అధికారులకు ఉరి శిక్ష విధించాలని కిమ్ ఆదేశించినట్టు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది.
ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో కిమ్ స్వయంగా పర్యటించారు. భారీగా జరిగిన ప్రాణనష్టం ఆయన్ను కలవరపాటుకు గురించేసింది. మొదట వెయ్యి మంది మరణించి ఉంటారని భావించినా తన పర్యటనలో మాత్రం అసలు వాస్తవాలు వెలుగుచూశాయి. భారీ జరిగిన ప్రాణ నష్టం తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించిందని కిమ్ భావించారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ దేశ సైనికులు పర్యటించి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బాధితులను ఆదుకుంటున్నారు. భారీగా కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల నేపథ్యంలో వేల మంది నిరాశ్రయులయ్యారు. వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.
అయితే వాస్తవ స్థితికి రావడానికి కనీసం మరో 3 నెలలైనా సమయం పట్టొచ్చని ఆ దేశ మీడియా వెల్లడించింది. 15వేల మందికి పైగా వృద్ధులు,వికలాంగులు, చిన్నారులను సైనికులు రక్షించి పునరావాస శిబిరాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో కిమ్ ఎమర్జెన్సీని ప్రకటించారు.