Hyundai Motor Sales Report: హ్యుందాయ్ క్రెటా విక్రయాలు ప్రతి అప్‌డేట్‌తో కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ గత నెలలో అమ్మకాలలో 12.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ప్రతి నెలా సగటున 15,000 యూనిట్ల కంటే ఎక్కువ. ఏప్రిల్‌లోనే హ్యుందాయ్ ఇండియా 15,447 యూనిట్ల క్రెటాను విక్రయించింది.
70,000 యూనిట్ల బుకింగ్ పెండింగ్‌లో...
70,000 యూనిట్ల మొత్తం ఆర్డర్ బుక్‌లో క్రెటా వాటా 50 శాతానికి పైగా ఉందని హ్యుందాయ్ తెలిపింది. ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయినప్పటి నుండి ఈ మిడ్ రేంజ్ ఎస్‌యూవీ కోసం కంపెనీ లక్షకు పైగా కొత్త ఆర్డర్‌లను పొందిందని హ్యుందాయ్ తెలిపింది.
భారతదేశ విక్రయాల్లో 67 శాతం ఎస్‌యూవీలే...
2024 ఏప్రిల్‌లో విక్రయించిన వాహనాల్లో 67 శాతం యూనిట్లు ఎస్‌యూవీలు అని హ్యుందాయ్ ప్రకటించింది. అంటే దాదాపు 35,140 ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయన్న మాట. ఇందులో క్రెటా 15,447 యూనిట్లు, వెన్యూ 9,122 యూనిట్లు, ఎక్స్‌టర్ 7,756 యూనిట్లు ఉన్నాయి.
కంపెనీ ఏం చెప్పింది?
హ్యుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ, "దేశీయ మార్కెట్లో 12.5 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గత సంవత్సరం నమోదైన వార్షిక వృద్ధి కంటే ఇది ఎక్కువగా ఉంది. అందుకే దేశీయ మార్కెట్లో క్రెటాకు డిమాండ్ పెరిగింది. క్రెటా ఉత్పత్తి చేస్తున్న శక్తి ఆశ్చర్యకరంగా ఉంది. క్రెటా దేశంలో పెరుగుతున్న ఎస్‌యూవీ డిమాండ్‌కు చిహ్నం." అన్నారు. హ్యుందాయ్ ఇండియా సెమీ అర్బన్, అర్బన్ మార్కెట్‌లలో ఎస్‌యూవీల బలమైన టేకోవర్‌ను చూపిస్తోంది. హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు అయిన క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్. అల్కాజార్‌ల సహకారంతో 67 శాతం నమోదు అయింది.
Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!
హ్యుందాయ్ మోటార్ ఇండియా వద్ద ప్రస్తుతం 43,000 యూనిట్లు లేదా దాదాపు 22 రోజుల స్టాక్ ఉంది. ఇండస్ట్రీ స్టాక్ 2024 ఏప్రిల్ చివరి నాటికి 3,60,000 యూనిట్లుగా ఉంటుందని అంచనా. ‘మా వద్ద 22 రోజుల స్టాక్ ఉంది. ఇది సరైన స్థాయి. పరిశ్రమలో ఆరు వారాల స్టాక్ ఉంది. అయితే మేము ఈ స్థాయి స్టాక్‌ను కొనసాగిస్తాము. బలమైన ఆర్డర్ బుక్ ఉన్నప్పటికీ సప్లై చెయిన్ మెరుగుపడింది. ముఖ్యంగా చిప్‌ల కొరత తగ్గుముఖం పట్టింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పెండింగ్ బుకింగ్‌లను వేగంగా క్లియర్ చేస్తుందనే నమ్మకంతో ఉంది.’ అని గార్గ్ తెలిపారు.
హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కార్లు ఇవే...
హ్యుందాయ్ భారతదేశం కోసం రెండు కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. ఇందులో అల్కాజార్ ఎస్‌యూవీ, కొత్త క్రెటా ఈవీ ఈ ఏడాది చివర్లో ఒక ప్రధాన అప్‌డేట్‌తో మార్కెట్లోకి వస్తాయి.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?