Upcoming Cars from Hyundai and Maruti Suzuki: భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సంవత్సరం దేశంలో కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో తన మొదటి ఆఫర్లుగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే నెలల్లో మార్కెట్లోకి రానుంది. ఇది ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ ఈ సంవత్సరాన్ని అప్‌డేట్ చేసిన క్రెటాతో ప్రారంభించింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 మధ్య నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను పరిచయం చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో రాబోయే కొత్త కార్ల గురించి తెలుసుకుందాం.


కొత్త తరం మారుతి స్విఫ్ట్/డిజైర్
మీడియా నివేదికల ప్రకారం కొత్త తరం మారుతి స్విఫ్ట్ ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానుంది. హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో మెరుగైన డిజైన్, ఇంటీరియర్‌ను పొందుతుంది. కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. ఇది గరిష్టంగా 82 బీహెచ్‌పీ పవర్‌ని, 108 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదే ఇంజిన్ కొత్త తరం మారుతి డిజైర్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.


మారుతి వ్యాగన్ఆర్ ఫేస్ లిఫ్ట్
మారుతికి సంబంధించి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన వాగన్ఆర్ రాబోయే నెలల్లో మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందుతుంది. 2024 మారుతి వ్యాగన్ఆర్ హారిజంటల్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఇన్సర్ట్, రీపోజిషన్డ్ రిఫ్లెక్టర్‌లతో కొద్దిగా అప్‌డేట్ చేసిన రియర్ బంపర్‌ను కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల చిన్నపాటి అప్‌గ్రేడ్‌లు చేస్తారని అంచనా. వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను ఉపయోగిస్తూనే ఉంది.


హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అనేది క్రెటా ఎస్‌యూవీకి సంబంధించిన స్పోర్టియర్ వెర్షన్. ఇది 2024 మధ్యలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ లాంచ్ చేయనున్న ఇతర ఎన్ లైన్ మోడళ్ల మాదిరిగానే, క్రెటా ఎన్ లైన్ కూడా ఫ్రంట్ గ్రిల్, బంపర్ రెడ్ యాక్సెంట్‌లను పొందుతుంది. గ్లోస్ బ్లాక్, ఫాక్స్ క్రష్డ్ అల్యూమినియం ఎలిమెంట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. స్పోర్టియర్ క్రెటాలో కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 160 పీఎస్, 253 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి రానుంది.


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ, అప్‌డేట్ చేయబడిన క్రెటా నుంచి ప్రేరణ పొందింది. ఇది భారీగా అప్‌డేట్ అయిన ఫ్రంట్ ఎండ్, కొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో గ్రిల్, బంపర్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్‌తో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ను పొందుతుంది. కొత్త హ్యుందాయ్ అల్కజార్‌లో కొత్త అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లను కూడా చూడవచ్చు. దీని ఇంజన్ సెటప్ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఉండనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!