Hyundai Exter Features: ఇటీవలే హ్యుందాయ్ మోటార్ భారతదేశంలో తన అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను విడుదల చేసింది. ఈ కారులో అనేక మంచి ఫీచర్లు అందించారు. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌ను కూడా పొందుతుంది. ఇది కంపెనీ లైనప్‌లో వెన్యూ ఎస్‌యూవీ కంటే కొంచెం కింద ఉంది. ఈ ఎస్‌యూవీని సెగ్మెంట్‌లోని ఇతర కార్ల కంటే భిన్నంగా చేసే టాప్ 5 ఫీచర్లు ఏవో తెలుసుకుందాం.


ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
కొత్త ఎక్స్‌టర్ ఎస్‌యూవీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉంది. ఇది ఈ విభాగంలోని ఏ ఇతర ఎస్‌యూవీలో కనిపించదు. భద్రత పరంగా ఇది చాలా ముఖ్యమైన ఫీచర్. ఎక్స్ (ఓ) వేరియంట్ కూడా ఈఎస్‌సీని పొందుతుంది. ఎక్స్‌టర్‌కు కాంపిటీషన్‌గా ఉన్న కార్లలో చాలా వాటికి డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు లేదా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. కాబట్టి ఎక్స్‌టర్ ఇతర మినీ ఎస్‌యూవీ కార్ల కంటే భిన్నంగా ఉంటుంది.


సన్‌రూఫ్
సన్‌రూఫ్ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి కనిపించింది. ఈ ఫీచర్ సాధారణంగా దీనికి పైన ఉన్న సెగ్మెంట్లలో కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఎక్స్‌టర్‌లో సన్‌రూఫ్ అందించారు. మీరు వాయిస్ కమాండ్ ద్వారా హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనికి సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఉంది.


డాష్‌క్యామ్
డాష్‌క్యామ్ అనేది ఆధునిక కార్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఒక ముఖ్యమైన ఫీచర్. ఇది ఎక్స్‌టర్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ డాష్‌క్యామ్‌లో అనేక రికార్డింగ్ మోడ్‌లు కూడా అందించారు.


ప్యాడిల్ షిఫ్టర్లు
ఎక్స్‌టర్... తన సెగ్మెంట్‌లోని ఇతర కార్ల మాదిరిగానే ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పొందుతుంది. అయితే ఇది ప్యాడిల్ షిఫ్టర్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా పొందుతుంది. ఇది ఎస్ఎక్స్, దాని హైఎండ్ మోడల్స్‌లో ఇవ్వబడింది. ప్రస్తుతం ప్యాడిల్ షిఫ్టర్‌లతో వస్తున్న ఏకైక ఏఎంటీ కారు ఎక్స్‌టర్ మాత్రమే.


మల్టిఫుల్ లాంగ్వేజెస్‌కు సపోర్ట్
ఇంగ్లీష్ కాకుండా ఎక్స్‌టర్ 10 ప్రాంతీయ భాషలకు మద్దతుతో మల్టీపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పొందుతుంది. దీనితో పాటు అనేక నేచురల్ సౌండ్స్ కూడా ఇందులో అందించారు. 










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial