Hyundai Exter CNG vs Tata Punch iCNG: మీరు కొత్త సీఎన్‌జీ కారుని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ముందున్న ఈ టాస్క్ ఈ ఆప్షన్లలో నుంచి మంచి కారును కొనుగోలు చేయాలి. ముఖ్యంగా చాలా మంది టాటా పంచ్ సీఎన్‌జీ కొనాలా లేకపోతే హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కొనాలా అని కన్ఫ్యూజన్‌ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.


ఇంజిన్ పరంగా ఏది బెస్ట్?
హ్యుందాయ్ తన సీఎన్‌జీ కారు అయిన ఎక్స్‌టర్ సీఎన్‌జీ డుయోలో 1.2 లీటర్ ట్విన్ ఫ్యూయల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అలాగే ఈ ఇంజన్ గరిష్టంగా 69 పీఎస్ పవర్‌, 95.2 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం హ్యుందాయ్ లాంచ్ చేసిన ఈ కొత్త సీఎన్‌జీ కారు 27.1 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.


మరోవైపు టాటా పంచ్ సీఎన్‌జీ గురించి చెప్పాలంటే కంపెనీ ఈ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 73.5 పీఎస్ పవర్‌, 103 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇంజన్ విషయానికొస్తే టాటా పంచ్ సీఎన్‌జీ మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది.


ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఫీచర్ల గురించి చెప్పాలంటే స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈఎస్సీ, హెచ్ఏసీ వంటి అనేక గొప్ప ఫీచర్లు హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీలో అందించారు. ఇది కారుకు మరింత అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది.


ఇక టాటా పంచ్ సీఎన్‌జీ గురించి మాట్లాడినట్లయితే ఇందులో ట్రై-యారో ఫినిష్ ఫ్రంట్ గ్రిల్, సీ పిల్లర్, మౌంటెడ్ డోర్ హ్యాండిల్, స్టైలిష్ టర్న్ ఇండికేటర్, ఓఆర్వీఎం, మాన్యువల్ ఏసీ, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండో, ఆటో హెడ్ ల్యాంప్ వంటి గొప్ప ఫీచర్లను అందించింది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు స్పీకర్లు కూడా అందించారు.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


ధర ఎంత ఉండవచ్చు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డుయో ఎస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను రూ.8.50 లక్షలుగా ఉంది. అదే సమయంలో సీఎన్‌జీ వేరియంట్ టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.38 లక్షలుగా నిర్ణయించారు.


ఇక టాటా పంచ్ సీఎన్‌జీ ధర గురించి చెప్పాలంటే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.23 లక్షల నుంచి మొదలై రూ. 9.85 లక్షల వరకు ఉంటుంది. ఇది కాకుండా టాటా పంచ్ సీఎన్‌జీలో 210 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ధర విషయంలో టాటా పంచ్ సీఎన్‌జీ చాలా విషయాలలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కంటే మెరుగైనదని చెప్పవచ్చు. ఫీచర్ల విషయంలో కూడా హ్యుందాయ్ ఎక్స్‌టర్ కంటే టాటా పంచ్ సీఎన్‌జీనే కాస్త ముందంజలో ఉంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?