Sundeep Kishan News | సౌత్ లో గ్లామర్ కు కాకుండా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే అతి తక్కువ మంది హీరోయిన్లలో రీతు వర్మ కూడా ఒకరు. ఇప్పటిదాకా ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటిగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న పత్రాలను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సందీప్ కిషన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది రీతూ. 


గత సంవత్సరం మాస్ మహారాజా రవితేజ తో కలిసి 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'మజాకా' మూవీ. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మజాకా' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, జి స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన 'పెళ్లి చూపులు, శ్వాగ్' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోందని అప్డేట్ బయటకు వచ్చింది. మూవీ షూటింగ్ సెట్స్ లో రీతు వర్మ జాయిన్ అయ్యిందంటూ తాజాగా సందీప్ కిషన్ బిటిఎస్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 


ఆ వీడియోలో రీతూ వర్మ పెళ్లి కూతురులా ముస్తాబై కన్పించింది. తెల్లటి చీర, పెళ్లి నగలతో చూడడానికి అందంగా కన్పిస్తోంది. సముద్రం ఒడ్డున రీతూ వర్మతో కలిసి సందీప్ కిషన్ కూర్చోవడం, వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీలా గొడవ జరగడం కన్పిస్తోంది. సినిమాలో ఇది ఏ సన్నివేశం అనేది తెలియాలంటే మూవీని తెరపై చూసేదాకా ఆగాల్సిందే. కానీ ఈ చిన్న బీటీఎస్ వీడియోలో రీతూ అలిగి క్యూట్ గా కంపించగా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగుంది అనే ఫీలింగ్ తెప్పించింది.    






ఇదిలా ఉండగా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్ లో పండగ కళ కన్పించింది. ఇందులో 'మన్మథుడు' ఫేమ్ అను, సీనియర్ నటుడు రావు రమేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇప్పటికే ఓటిటి, శాటిలైట్ రైట్స్ ను 23 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో రీతూ వర్మ భాగం కాబోతోంది అనే వార్త సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ ఏడాది 'కెప్టెన్ మిల్లర్', 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి సినిమాలతో అలరించిన సందీప్ కిషన్ ఇప్పుడు 'మజాకా' మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.


Read Also : Chiranjeevi: ఎనలేని ప్రోత్సాహం, ఎనలేని ఆనందం- 50 ఏండ్ల నట ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్