Hyundai Creta Facelift Sales: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇటీవల రూ. 11 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్‌లకు చాలా డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. మొత్తం బుకింగ్‌లో వరుసగా 55 శాతం వీటికే ఉన్నాయి. మిగతా ఆర్డర్లలో 45 శాతం డీజిల్ వేరియంట్‌లకు సంబంధించినవి. కొత్త క్రెటా కోసం ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు జరిగాయి. హ్యుందాయ్ 2024లో 65 శాతం అమ్మకాలు ఎస్‌యూవీల నుంచి వస్తాయని అంచనా.


ధర,  వేరియంట్లు ఇలా...
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోలిస్తే కొత్త క్రెటా ఎంట్రీ లెవల్ మోడల్ రూ.13,000, టాప్ ఎండ్ వేరియంట్లు రూ. 80,000 వరకు ధరలు పెరిగాయి. అప్‌డేట్ చేసిన మోడల్ లైనప్‌లో 19 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు ఇంజన్ ఆప్షన్లు, ఐదు గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది.


ఎన్ లైన్ వేరియంట్ త్వరలో
క్రెటా అప్‌డేట్ చేసిన తర్వాత హ్యుందాయ్ దాని స్పోర్టియర్ ఎన్ లైన్ ఎడిషన్‌ను 2024 మధ్య నాటికి లాంచ్ అవ్వనుంది. జీటీఎక్స్ ప్లస్‌తో  పోటీ పడేందుకు, ఈ ఇంజన్ 160 పీఎస్ పవర్, 253 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను అందించగలదు. ఎన్ లైన్ వేరియంట్ లోపల, బయట ప్రత్యేకమైన 'ఎన్ లైన్' ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. సాధారణ క్రెటాకు, దీనికి మధ్య ఉండే తేడా ఇదే.


హ్యుందాయ్ క్రెటా ఈవీ 2025లో...
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మోడల్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఇది 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ కానుందని అంచనా. ఈ సంవత్సరం చివర్లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఎల్ఎఫ్ కెమ్ నుంచి సేకరించబడిన 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రాబోయే మారుతి సుజుకి ఈవీఎక్స్ (48 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్)లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పోలిస్తే ఈ చిన్న బ్యాటరీ క్రెటా ఈవీలోని గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి తెచ్చుకున్న ఎలక్ట్రిక్ మోటారుతో పెయిర్ కానుంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!