Hyundai Creta: హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024కి అనేక కొత్త ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. కంపెనీ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 జనవరి 16వ తేదీన లాంచ్ చేయడంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత కంపెనీ అప్‌డేట్ చేసిన అల్కజార్, టక్సన్ ఎస్‌యూవీలను కూడా లాంచ్ చేయనుంది. అదనంగా హ్యుందాయ్ తన మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా ఈవీని కూడా ప్రదర్శిస్తుందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది చాలాసార్లు టెస్టింగ్‌లో కూడా కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి త్వరలో లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2024 సెకండాఫ్‌లో రానుంది.


హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ డిజైన్
దాని ఐసీఈ మోడల్‌తో పోలిస్తే హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు ఈవీ నిర్దిష్ట డిజైన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది స్ప్లిట్ ప్యాటర్న్ హెడ్‌ల్యాంప్‌లు, క్యూబ్ లాంటి డిటైలింగ్, హెచ్ ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎక్స్‌టర్ మాదిరిగానే అప్‌డేట్ అయిన టెయిల్‌గేట్‌ను పొందుతుంది. ఫీచర్ల పరంగా ఎలక్ట్రిక్ క్రెటా దాని ఐసీఈ మోడల్‌ను పోలి ఉంటుంది.


హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎలా ఉంది?
మీడియా నివేదికల ప్రకారం హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎల్జీ కెమ్‌తో కూడిన చిన్న 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుంది. ఇది గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి తీసుకున్న ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ముందు భాగం గరిష్టంగా 138 బీహెచ్‌పీ శక్తిని, 255 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని పోటీదారు, రాబోయే మారుతి సుజుకి ఈవీఎక్స్, రెండు బ్యాటరీ ఎంపికలతో అందించబడుతుంది. 48 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్‌తో లాంచ్ కానుంది.


2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఐసీఈ వెర్షన్ లాగానే 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. అయితే ఇంజిన్‌లలో కొత్త 160 బీహెచ్‌పీ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్, మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలో అందుబాటులో ఉంటుంది. కొత్త క్రెటా లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా ఉండనుంది. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్ అప్హోల్స్టరీ కోసం కొత్త కలర్ స్కీమ్‌లో కూడా అందుబాటులో ఉంది.


మరోవైపు హోండా కార్స్ ఇండియా తన వాహనాల ధరలను కొత్త సంవత్సరం అంటే 2024 జనవరి నుంచి పెంచనున్నట్లు సమాచారం. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను దీనికి కారణంగా హ్యుందాయ్ పేర్కొంది. హ్యుందాయ్ ఇండియా ఏ మోడల్‌పై ఎంత ధరను పెంచుతుందో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. హోండా ఇటీవల తన మైక్రో ఎస్‌యూవీ ఎలివేట్‌తో దేశీయ మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హ్యుందాయ్ ఎలివేట్ ఎస్‌యూవీ సెప్టెంబర్‌లో రూ. 11 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో భారతదేశంలో లాంచ్ అయింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!