New Hyundai Creta 2024: హ్యుందాయ్ తన 2024 క్రెటా మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.99 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. కొత్త క్రెటా భారీ మార్పులతో వచ్చింది. దాని ఫీచర్ లిస్ట్‌లో బోలెడన్ని అప్‌డేట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా దాని డిజైన్ అయితే చాలా వరకు మారింది.


కొత్త క్రెటా ఇంజిన్ ఆప్షన్లు, వేరియంట్లు
కొత్త క్రెటా రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే దీన్ని 19 విభిన్న వేరియంట్‌లు, 7 ట్రిమ్ లెవల్స్ నుండి ఎంచుకోవచ్చు. దీని ట్రిమ్ గురించి చెప్పాలంటే ఇందులో E, EX, S, S(O), SX, SX Tech, SX(O) మోడల్స్‌లో అందుబాటులో ఉంది. క్రెటా కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది మునుపటి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ స్థానంలో ఉంది. మిగిలిన రెండు ఇంజిన్లు కూడా 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లను ఆశించాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ కూడా ఆటో డీసీటీతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


కొత్త క్రెటా ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్లను కలిగి ఉంది. అయితే ఇది కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు వెనుకవైపు లైట్ బార్‌ను కూడా పొందుతుంది. క్యాబిన్ గురించి చెప్పాలంటే కొత్త క్రెటా లోపల కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ ప్యానెల్ అందిస్తారు. రీడిజైన్ చేసిన ఇంటీరియర్ కూడా చూడవచ్చు.


ఇది కాకుండా సెక్యూరిటీ ఫీచర్ల పరంగా, కొత్త క్రెటా 2024లో ఏడీఏఎస్ లెవల్ 2, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరింత కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో అప్‌డేట్ చేశారు. ఇప్పుడు ఇది ఇంటర్నల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ని కూడా కలిగి ఉంది.


కొత్త క్రెటా హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీకి పెద్ద అప్‌డేట్. అలాగే హ్యుందాయ్ ఫీచర్ల జాబితా కూడా అప్‌డేట్ అయింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే క్రెటా గత తరం నుంచి దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది.


మరోవైపు టాటా పంచ్ ఈవీ భారతదేశ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ ధరను రూ. 14.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) డిసైడ్ అయ్యారు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీని జనవరి 22వ తేదీ నుంచి స్టార్ట్ చేయనుంది. కస్టమర్లు స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్‌లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కొత్త టాటా పంచ్ ఈవీని బుక్ చేయవచ్చు.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!