Realme Note 1 Leaks: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఈ నెలాఖరులో లాంచ్ కానుంది. దీంతోపాటు ‘నోట్’ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా కంపెనీ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సిరీస్‌లో రియల్‌మీ నోట్ 50 మొదటిగా లాంచ్ కానుంది. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లీకుల ప్రకారం రియల్‌మీ నోట్ 1 ఈ సిరీస్‌లో మొదటిగా లాంచ్ కానుంది.
రియల్‌మీ నోట్ 1 అని ఉన్న ఒక హ్యాండ్ సెట్‌ను ఒక ఎక్స్/ట్విట్టర్ యూజర్ షేర్ చేవారు. దీనికి సంబంధించిన లీక్డ్ ఫొటోలను ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి. జనవరిలోనే ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఏరోజు లాంచ్ కానుందనే విషయం తెలియరాలేదు.
దీని లీక్డ్ ఇమేజ్ ప్రకారం ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ స్క్రీన్ అందించనున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W వైర్డ్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ నోట్ 1 స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. డ్యూయల్ స్పీకర్లు, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 30, రెడ్‌మీ నోట్ 13లతో రియల్‌మీ నోట్ 1 పోటీ పడనుంది. ఇన్‌ఫీనిక్స్ నోట్ 30 మనదేశంలో రూ.14,999 ధరతో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 13 ధర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మీ నోట్ 1 ధర కూడా ఈ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. గతంలో వార్తల్లో నిలిచిన రియల్‌మీ నోట్ 50 4జీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ మొబైల్ రూ.ఏడు వేల నుంచి రూ.ఎనిమిది వేల మధ్యలో ఉండనుందని తెలుస్తుంది.
ప్రస్తుతం భారతీయ టెలికాం వినియోగదారులు క్రమంగా 5జీ నెట్‌వర్క్‌కు అలవాటు పడుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సేవను అందజేస్తున్నాయి. ఒకవేళ 5జీ ఇంటర్నెట్‌కు మీరు అలవాటు పడితే త్వరలో కచ్చితంగా 5జీ ప్లాన్‌ని కొనుగోలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే జియో, ఎయిర్‌టెల్ తమ అన్‌లిమిటెడ్ 5జీ సర్వీసులను ఎత్తి వేస్తారని వార్తలు వస్తున్నాయి. భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభించి చాలా నెలలు అవుతుంది. ఎయిర్‌టెల్, జియో భారతదేశంలోని రెండు అగ్రగామి టెలికాం కంపెనీలుగా ఉండేవి. ఇవి మన దేశంలో మొదట 5జీ సర్వీసును ప్రారంభించాయి.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!