Hyundai Alcazar Facelift: ఇటీవల రివీల్ అయిన హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని పరిశీలిస్తే, ఇది త్వరలో మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందబోతున్నట్లు తెలుస్తోంది. దాని డిజైన్ వివరాలు చాలా వరకు కవర్ అయ్యాయి. ఎక్స్‌టర్‌లో కనిపించే బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని ఈ అల్కజార్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. 2024 ప్రారంభంలో లాంచ్ అయ్యే క్రెటా ఫేస్‌లిఫ్ట్ తరహాలో కూడా అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.


డిజైన్ ఇలా?
అప్‌డేట్ అయిన అల్కాజర్ ముందు భాగంలో రీడిజైన్ చేసిన గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్‌తో అప్‌డేట్ అయిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, అప్‌డేట్ అయిన బంపర్ వచ్చే అవకాశం ఉంది. అయితే సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పు ఉండదు. ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు, వెనుకవైపు కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, బంపర్‌లో మరికొన్ని అప్‌డేట్‌లను చూడవచ్చు.


ఇంటీరియర్ ఎలా ఉంది?
ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు ఉండవు. అప్‌డేట్ అయిన అప్‌హోల్ట్స్టరీ, అప్‌గ్రేడ్ అయిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ అయిన స్టీరింగ్ వీల్ ఇందులో అందించారు. ఇది ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవ్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, పాడిల్ షిఫ్టర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి అధునాతన ఫీచర్లతో కూడా వస్తుంది. బోస్ సౌండ్ సిస్టమ్‌తో సహా కొన్ని ఇతర ప్రీమియం ఫీచర్లను కూడా ఇందులో చూడవచ్చు.


ఇంజిన్‌లో ఏం మార్చారు?
దీని ఇంజన్ లైనప్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది మునుపటిలాగా 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇది వరుసగా 160 బీహెచ్‌పీ, 115 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఆర్డీఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.


ధర ఎంత ఉండవచ్చు?
అప్‌డేట్ అయిన అల్కజార్ ధర ప్రస్తుత మోడల్‌తో సమానంగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 16.77 లక్షల నుంచి రూ. 21.23 లక్షల మధ్య ఉంది. ఇది మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్. ఇది 6 సీటర్, 7 సీటర్ వెర్షన్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఎస్‌యూవీ టాటా హారియర్, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి కార్లతో పోటీపడుతుంది.


మరోవైపు సిట్రోయెన్ ఎట్టకేలకు తన సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. రూ. 25,000 చెల్లించి ఈ కారును వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ మోడల్ లైనప్ యూ, ప్లస్, మ్యాక్స్ అనే మూడు విభిన్న వేరియంట్లలో వస్తుంది. ఇది 5 సీటర్, 7 సీటర్ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్లో లాంచ్ అయింది.


Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial