ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సేల్ తేదీలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ సేల్ ఆఫర్లను కంపెనీ గత కొద్ది కాలంగా టీజ్ చేస్తూనే ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఎప్పట్లాగే ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, శాంసంగ్, షియోమీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందించనున్నారు. దీంతోపాటు యాక్సెసరీలు, వేరబుల్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై కూడా డిస్కౌంట్ లభించనుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, క్రెడిట్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు కూడా లభించనున్నారు.


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఆరు కొత్త ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. మోటొరోలా, వివో, శాంసంగ్ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నాయి. మోటొరోలా ఎడ్జ్ 40 నియో, వివో టీ2 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 2023 ఎడిషన్లు సేల్‌లోకి రానున్నాయి.


దీంతోపాటు మోటో జీ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ, రియల్‌మీ సీ51, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11ఎక్స్ 5జీ, ఇన్‌ఫీనిక్స్ జీరో 30 5జీ, మోటో జీ84 5జీ, వివో వీ29ఈ, పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లపై ధర తగ్గింపు లభించనుంది.


ఐఫోన్ ప్రీమియం హ్యాండ్ సెట్లపై కూడా మంచి ఆఫర్లు లభించనున్నాయి. ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ రూ.92 వేలకు (బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని) వస్తుందని తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్, పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లపై కూడా ఆఫర్లు లభించనున్నాయి.


ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ ఉన్న వినియోగదారులకు కాస్త ముందుగానే ఎర్లీ యాక్సెస్ సేల్ జరగనుంది. ఇందులో అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అదనపు వారంటీలు కూడా అందించనున్నారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు తగ్గింపు కూడా లభించనుంది.


మరోవైపు రిలయన్స్ జియో తన వినయోగదారుల కోసం  వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరుతో దీనిని లాంచ్ చేసింది. గృహాలు, ఆఫీసు అవసరాల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. 1.5 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎలాంటి అంతరాయాలు లేకుండా హెచ్‌డీ వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్,  వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. 2023లో జరిగిన జియో వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఈ సేవలను వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జియో ఎయిర్ పైబర్ లో పేరెంటల కంట్రోల్స్, వైఫై 6 సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌ వాల్ సహా అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.   


Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!


Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే ! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial