Diwali 2025 Discounts On Hyundai Cars: ఈ దీపావళి సీజన్‌లో, హ్యుందాయ్ ఇండియా తన కస్టమర్ల కోసం పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించింది. చిన్న కార్ల నుంచి ప్రీమియం SUVల వరకూ దాదాపు అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Tucson & IONIQ 5 మోడల్స్ మీదయితే అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి.
Grand i10 Nios - చిన్న కారు పెద్ద ఆఫర్
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో Grand i10 Nios చాలా పాపులర్ అయిన కారు. అక్టోబర్ నెల ఆఫర్లతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.
Era Petrol వేరియంట్‌లపై ₹55,000 బెనిఫిట్
MT non-CNG & CNG వేరియంట్‌లపై ₹75,000 వరకు లాభం
AMT వేరియంట్‌లకు ₹70,000 టోటల్ బెనిఫిట్స్
Aura - ఈ స్మార్ట్ సెడాన్‌పై మంచి డిస్కౌంట్
Aura SX MT వేరియంట్‌పై ₹58,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇతర పెట్రోల్ & CNG వేరియంట్‌లకు ₹43,000 నుంచి ₹53,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ EX వేరియంట్‌లకు కూడా ₹25,000 లాభం ఉంది.
Tucson - SUV సిరీస్‌లో పెద్ద సర్‌ప్రైజ్
Hyundai Tucson పై భారీ ఆఫర్లు ఉన్నాయి. దీనిలో:
Petrol variants - ₹95,000
Diesel variants - ₹1,30,000
4WD Diesel variant - ₹1,45,000 వరకు ప్రయోజనాలు
IONIQ 5 - ఎలక్ట్రిక్ SUVపై రికార్డు ఆఫర్
హ్యుందాయ్ Ioniq 5 పై ₹7,05,000 వరకు లాభాలు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రెండూ ఉన్నాయి.
| మోడల్ | క్యాష్ డిస్కౌంట్ (వరకు) | కార్పొరేట్, ఎక్సేంజ్ & స్క్రాపేజ్ (వరకు) | మొత్తం బెనిఫిట్ (వరకు) |
|---|---|---|---|
| Grand i10 Nios | రూ. 30,000 | రూ. 45,000 | రూ. 75,000 |
| Aura | రూ. 25,000 | రూ. 33,000 | రూ. 58,000 |
| Exter | రూ. 20,000 | రూ. 25,000 | రూ. 45,000 |
| i20 & N Line | రూ. 15,000 | రూ. 40,000 | రూ. 55,000 |
| Venue & N Line | రూ. 15,000 | రూ. 35,000 | రూ. 50,000 |
| Verna | రూ. 20,000 | రూ. 35,000 | రూ. 55,000 |
| Creta | – | రూ. 5,000 | రూ. 5,000 |
| Alcazar FL | రూ. 30,000 | రూ. 30,000 | రూ. 60,000 |
| Tucson | రూ. 60,000 | రూ. 85,000 | రూ. 1,45,000 |
| IONIQ 5 | రూ. 7,00,000 | రూ. 5,000 | రూ. 7,05,000 |
ఇతర మోడల్స్ - ప్రతి కారుపై ఏదో ఒక ఆఫర్
Exter - ₹45,000 (₹20,000 క్యాష్ బ్యాక్ + ₹25,000 ఇతర బెనిఫిట్స్)
i20 / i20 N Line - ₹55,000 వరకు లాభం
Venue / Venue N Line - ₹50,000 వరకు ప్రయోజనాలు
Verna - ₹55,000
Alcazar - ₹60,000
Creta మీద చిన్న ఎక్స్చేంజ్ బెనిఫిట్ మాత్రమే
విచిత్రం ఏంటంటే, ప్రజాదరణ గల Cretaపై మాత్రం పెద్ద ఆఫర్లు లేవు. కొన్ని చిన్న ఎక్స్చేంజ్ బోనస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆఫర్లు ప్రాంతానికి ఒకలా మారవచ్చు. స్టాక్ లభ్యత, షోరూమ్ ఆధారంగా బెనిఫిట్స్ వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న మోడల్ కోసం వెంటనే సమీప హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి.