How to Buy Tata Punch CNG on EMI: మీరు తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే కారుని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే టాటా పంచ్ సీఎన్‌జీ మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. టాటా పంచ్ సీఎన్‌జీ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర, ఈఎంఐ, డౌన్ పేమెంట్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.23 లక్షలుగా ఉంది. రూ. 8.1 లక్షల ఆన్ రోడ్ ధరతో మీరు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
టాటా పంచ్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. లక్ష చెల్లించాలి. దీని కోసం మీరు రూ. 7.1 లక్షల కారు లోన్ తీసుకోవాలి. 10 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 15,146 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాలి. అంటే మీకు వడ్డీ రూ.1.96 లక్షలు పడుతుందున్న మాట.
Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
టాటా పంచ్ సీఎన్‌జీ ఫీచర్లు ఇవే...
టాటా పంచ్ 6000 ఆర్పీఎం వద్ద 86 పీఎస్ పవర్‌ని, 3300 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇది స్టాండర్డ్‌గా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టాటా పంచ్ సీఎన్‌జీ 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
టాటా పంచ్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బలమైన బాడీ, గొప్ప డిజైన్, మంచి ఫీచర్లకు పేరు చెందింది. ఇది తగినంత స్థలం, స్పేస్, అద్భుతమైన మైలేజీ కోసం హై స్టాండర్డ్ ఫీచర్లను అందిస్తుంది. తక్కువ రేటులో ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చినందున టాటా పంచ్ సీఎన్‌జీకి మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది.
Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?