Grand Vitara CNG Price, Down Payment, Loan and EMI Details: మారుతి సుజుకీ, ఇటీవలే, తన పాపులర్‌ గ్రాండ్ విటారాలో CNG వేరియంట్‌ను రీలాంచ్‌ చేసింది. మారుతి గ్రాండ్ విటారా CNG అద్భుతమైన రేంజ్‌ & సేఫ్టీ రేటింగ్‌తో వచ్చింది. మీరు ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఒకేసారి ఫుల్‌ పేమెంట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఈ CNG మోడ్‌ కారును ఫైనాన్స్‌లో కూడా తీసుకోవచ్చు, ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు.

Continues below advertisement


తెలుగు రాష్ట్రాల్లో మారుతి గ్రాండ్ విటారా CNG ధర ఎంత?
మారుతి గ్రాండ్ విటారా CNG ఎక్స్-షోరూమ్ ధర (Grand Vitara CNG ex-showroom price) రూ. 13.48 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62 లక్షల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని డెల్టా CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర (Grand Vitara CNG on-road price) రూ. 16.65 లక్షల వరకు ఉంటుది. ఇందులో.. ఎక్స్‌-షోరూమ్‌ రేటు, RTO ఛార్జీలు, బీమా & ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. గ్రాండ్ విటారా CNG కోసం పూర్తి చెల్లింపు చేసేంత డబ్బు మీ దగ్గర లేకపోతే, స్వల్ప మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించి, ఈ కారును ఫైనాన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? 
మీ దగ్గర కేవలం లక్ష రూపాయలు ఉన్న చాలు, గ్రాండ్ విటారా CNG కొనవచ్చు. ఈ రూ. లక్షను డౌన్ పేమెంట్‌ చేసి మిగిలిన రూ. 15.65 లక్షలకు బ్యాంక్‌ నుంచి కారు లోన్ తీసుకోవాలి. బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు కారు షోరూమ్‌లోనే ఉంటారు. వాళ్లు, అవసరమైన డాక్యుమెంటేషన్‌ వర్క్‌ పూర్తి చేసి కేవలం 30 నిమిషాల్లో మీకు లోన్‌ మంజూరు అయ్యేలా చేస్తారు. మీ క్రెడిట్‌ స్కోర్‌, నెలవారీ ఆదాయం విషయంలో బ్యాంక్‌ సంతృప్తి చెందితేనే మీకు లోన్‌ మంజూరవుతుందని గుర్తుంచుకోండి. లోన్‌ మొత్తాన్ని బ్యాంక్‌ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని భావిస్తే, రూ. 15.65 లక్షల కార్‌ లోన్‌పై నెలవారీ EMI ఎంత అవుతుందో లెక్క చూద్దాం.


7 సంవత్సరాల కాల పరిమితితో లోన్‌ తీసుకుంటే నెలకు రూ. 25,179 EMI చెల్లించాలి.


6 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా రుణం తీసుకుంటే నెలకు రూ. 28,210 EMI చెల్లించాలి.


5 సంవత్సరాల టెన్యూర్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే నెలకు రూ. 32,487 EMI చెల్లించాలి.


4 సంవత్సరాల కాలం కోసం రుణం  తీసుకుంటే నెలకు రూ. 38,945 EMI చెల్లించాలి.
 
లోన్‌ టెన్యూర్‌ తగ్గే కొద్దీ EMI పెరిగినప్పటికీ, బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ గణనీయంగా తగ్గుతుంది. ఇంకా, మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేయగలిగితే, ఆ మేరకు రుణం భారం తగ్గుతుంది. బ్యాంక్‌ మీకు మంజూరు చేసే రుణ మొత్తం, వార్షిక వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ విధానాలపై ఆధారపడి ఉంటాయి. 


గ్రాండ్ విటారా CNG ఫీచర్లు
మారుతి గ్రాండ్ విటారా CNG పెర్ఫార్మెన్స్‌లోనే కాదు, ఫీచర్లలోనూ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. సాధారణంగా లగ్జరీ సెగ్మెంట్ వాహనాల్లో మాత్రమే కనిపించే ఫీచర్లను మారుతి గ్రాండ్ విటారా CNG ఇంటీరియర్‌లో చూడవచ్చు. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది, ఇది క్యాబిన్‌ను విశాలంగా & ఆకర్షణీయంగా మారుస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో మీ జర్నీని ఆహ్లాదరకరంగా మార్చుకోవచ్చు. డ్రైవర్ సౌలభ్యం కోసం 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది.


మారుతి గ్రాండ్ విటారా CNG 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. CNG మోడ్‌లో ఈ కారు కిలోగ్రాముకు 26.6 కి.మీ. మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటించింది.