6 Airbags Maruti Alto K10 on EMI: మన దేశంలో రోడ్లపై రయ్యిన పరుగులు తీస్తున్న చవక కార్లలో మారుతి సుజుకి ఆల్టో K10 ఒకటి. దీని ధర & మైలేజ్‌ కారణంగా జనానికి ఇష్టమైన కార్‌గా నిలిచింది, ఎక్కువగా అమ్ముడుబోతోంది. మీరు కూడా బడ్జెట్‌ ఫ్లెండ్లీ కార్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మారుతి ఆల్టో K10 గురించి కూడా ఓసారి ఆలోచించవచ్చు.

Continues below advertisement


మారుతి ఆల్టో K10 ఇప్పుడు కొత్తగా మారింది, కీలక అప్‌డేట్స్‌ వచ్చాయి. ఇంతకుముందు, మారుతి ఆల్టో K10లో ముందు వైపున రెండు (డ్యూయల్) ఎయిర్‌ బ్యాగులను మాత్రమే కంపెనీ అందించింది. ఇప్పుడు, కారు వెనుక సీట్‌లో కూర్చున్న ప్యాసింజర్ల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఎయిర్‌ బ్యాగ్‌లు యాడ్‌ చేసింది. ఇప్పుడు, ఈ మారుతి కార్‌లో మొత్తం కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు.


కొత్త ఆల్టో K10 ధర ఎంత? 
మీరు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర ‍‌(New Alto K10 ex-showroom price, Delhi) ఇప్పుడు రూ. 4.23 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కంపెనీ ఈ కార్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మునుపటితో పోలిస్తే ప్రస్తుత ధర పెరిగింది. 


డౌన్‌ పేమెంట్‌ & లోన్‌ వివరాలు
కొత్త ఆల్టో K10 ను లోన్‌పై తీసుకోవాలని భావిస్తుంటే, ముందుగా, డౌన్‌ పేమెంట్‌, EMI & ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి. కొత్త మారుతి ఆల్టో K10 కొనాలంటే, దిల్లీలో ఆన్ రోడ్ ధర ‍‌(New Alto K10 On-road price, Delhi) దాదాపు రూ. 4.70 లక్షలు చెల్లించాలి. ఇంత మొత్తం ఒకేసారి పెట్టలేం అనుకునేవాళ్లకు బ్యాంక్‌ లోన్‌ (అర్హతల ఆధారంగా) కూడా లభిస్తుంది. లోన్‌ రావాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. మీరు ఈ కారును రూ. 50,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, బ్యాంక్‌ నుంచి రూ. 4.20 లక్షల కారు లోన్ తీసుకోవాలి.


EMI వివరాలు


బ్యాంక్‌ మీకు 9.80 శాతం వడ్డీ రేటుతో రూ. 4.20 లక్షల కారు లోన్ మంజూరు చేస్తే, మీరు 7 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 6,929 EMI చెల్లించాలి. ఈ విధంగా, మీరు 6 సంవత్సరాలలో మొత్తం రూ. 5,82,050 బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు. వడ్డీ మొత్తం రూ. 1,62,050 అవుతుంది.


మీరు 6 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 7,739 EMI చెల్లించాలి. ఈ 6 సంవత్సరాలలో మొత్తం రూ. 5,57,176 బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు. వడ్డీ మొత్తం రూ. 1,37,176 అవుతుంది. 


మీరు 5 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 8,882 EMI చెల్లించాలి. ఈ 5 సంవత్సరాలలో మొత్తం రూ. 5,32,949 బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు. వడ్డీ మొత్తం రూ. 1,12,949 అవుతుంది.


మీరు 4 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 10,612 EMI చెల్లించాలి. ఈ 4 సంవత్సరాలలో మొత్తం రూ. 5,09,376 బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు. వడ్డీ మొత్తం రూ. 89,376 అవుతుంది.


మీరు 3 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 13,513 EMI చెల్లించాలి. ఈ 3 సంవత్సరాలలో మొత్తం రూ. 4,86,461 బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు. వడ్డీ మొత్తం రూ. 66,461 అవుతుంది.


మారుతి ఆల్టో పవర్
జపనీస్ ఆటోమేకర్‌, కొత్త ఆల్టో K10లో ఎటువంటి మెకానికల్‌ చేంజెస్‌ చేయలేదు. 998 cc K10C పెట్రోల్ ఇంజిన్‌ ఈ కార్‌ను పరుగులు తీయిస్తుంది. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 49 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది & 3,500 rpm వద్ద 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు లింక్‌ చేశారు. మారుతి ఆల్టో K10లో ఒకేసారి 27 లీటర్ల పెట్రోల్‌ కొట్టించవచ్చు. ఈ కారు పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు CNG వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది.